చేతికొచ్చిన పంటను గడ్డి మందు కొట్టి నాశనం చేశారు. ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు పసుపులేటి నాగార్జున
చేతికొచ్చిన పంటను గడ్డి మందు కొట్టి నాశనం చేశారు. ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు పసుపులేటి నాగార్జున
జలదంకి, మేజర్ న్యూస్ :-
వరి పంట చేతికి వచ్చే సమయానికి గడ్డి ముందు కొట్టి తమ పంటని నాశనం చేశారని బాధితుడు పసుపులేటి నాగార్జున తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. జలదంకి మండలం కోదండరామపురానికి చెందిన పసుపులేటి. నాగార్జున వేసిన వరి పంటను చేతికొచ్చే సమయంలో వేములపాడు కు చెందిన కొందరు గడ్డి మందు తో పంటను నాశనం చేశారని గత 20 సంవత్సరాల నుంచి పంటను సాగు చేసుకుంటున్నట్లు బాధితుడు తెలిపారు. ఇటీవల తహసిల్దార్ వద్దకు వెళితే ఎవరి పొలాన్ని వారు సాగు చేసుకోమని తెలిపారని దీంతో నేను పంటను సాగు చేసుకున్నానని బాధితుడు అన్నారు. పొలం నాశనం చేసింది ఉప్పు రమణయ్య, వేముల సుధాకర్, ఉప్పు ఏడుకొండలు, ఉప్పు తిరపతి అను వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. కఠిన చర్యలు తీసుకోని నాకు న్యాయం చేయాలనీ కోరారు.