విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

వైజీఎస్ బీఏ అధ్రక్షులు షేక్. జమాలుల్లా

క్రీడాకారులకు టీ షర్ట్ లు, షటిల్ రాకెట్ ల పంపిణీ

షటిల్ రాకెట్లు బహూకరిస్తున్న గిరిబాబు, అబ్దుల్ కలామ్ లు

 డబుల్స్ విజేతలకు మెమెంటోలు అందిస్తున్న వైజీఎస్బీఏ సభ్యులు

 క్రీడాకారులకు టీ షర్ట్ లు అందిస్తున్న దృశ్యం

 హోరాహోరీగా సాగుతున్న క్రీడాపోటీలు

గూడూరు : విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చి దిద్దడమే ది యంగ్ గూడూర్ షటిల్ బాడ్మింటన్ అసోసియేషన్ లక్ష్యమని ఆ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్. జమాలుల్లా అన్నారు. సోమవారం స్థానిక పెద్ద మశీదువీధిలోని కంచుకోట వారియర్స్ షటిల్ కోర్టులో అండర్ 13, మెన్స్ డబుల్స్ షటిల్ బాడ్మింటన్ పోటీలను వైజీఎస్ బీఏ ఆధ్వర్యంలో నిర్వహించారు. అలాగే ప్రముఖ వస్త్ర వ్యాపారి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాధంశెట్టి గిరిబాబు దాతృత్వంతో క్రీడాకారులకు క్రీడా దుస్తులు, షటిల్ బ్యాట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు పట్టణ, పరిసర ప్రాంతాలలో షటిల్ క్రీడాభివృద్ధికి పదకొండేళ్లుగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామన్నారు.అందులో భాగంగా కరోనాకు ముందు వరకూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఉచిత వేసవి శిక్షణా తరగతులను నిర్వహించామన్నారు. ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో క్రీడాపోటీలను నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ప్రస్తుతం విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో అండర్ 13 డబుల్స్, మెన్స్ డబుల్స్ పోటీలను నిర్వహించామన్నారు.  క్రీడాకారులకు పదివేల రూపాయల విలువైన షటిల్ రాకెట్లు, టీ షర్ట్ లు అందించిన గిరిబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు షేక్. అబ్దుల్ కలామ్ మాట్లాడుతూ విద్యార్థులను క్రీడల పట్ల ఆసక్తి పెరిగేలా కృషి చేస్తున్న అసోసియేషన్ అధ్యక్షులు, అలాగే పేద క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బ్యాట్లు, టీ షర్ట్ లు అందించిన గిరిబాబుల సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. దాత,  వైజీఎస్బీఏ ప్రధాన కార్యదర్శి గాధంశెట్టి గిరిబాబు మాట్లాడుతూ అసోసియేషన్ తర్ఫీదు, దాతల సహకారంతో జాతీయ స్థాయికి ఎదిగిన గౌస్, బషీర్, ఇర్షాద్ లను ఆదర్శంగా తీసుకుని క్రీడలలో రాణించాలని విద్యార్థులను కోరారు. క్రీడాకారులకు ఎటువంటి సహకారం అవసరమైనా అందించేందుకు తమ అసోసియేషన్ సిద్ధంగా ఉన్నట్లు క్రీడాకారుల కరతాళ ధ్వనుల నడుమ ప్రకటించారు. అనంతరం ఇద్దరు క్రీడాకారులకు షటిల్ రాకెట్లు, 15మందికి క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. అలాగే అండర్ 13 విభాగంలో విన్నర్స్ షోయబ్-అఫ్నాన్, రన్నర్స్ ఖీజర్-షాహిర్, బెస్ట్ డిఫెన్స్ సాధిక్ లకు, మెన్స్ డబుల్స్ విన్నర్స్ రబ్బాని-హక్ నవాజ్, రన్నర్స్ షాలు-తాహీర్ లకు మెమెంటోలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైజీఎస్బీఏ అధ్యక్షుడు షేక్. జమాలుల్లా, ఉపాధ్యక్షులు షేక్. అబ్దుల్ కలామ్, ప్రధాన కార్యదర్శి గాధం శెట్టి గిరిబాబు, సభ్యులు షేక్. జబీవుల్లా, కంచుకోట షటిల్ క్లబ్ సభ్యులు ఖలీల్, దావూద్, సాధిక్, యాసిర్, రబ్బాని, ఆసిఫ్, షాలు, అంజాద్, రియాజ్, హఖ్ నవాజ్, నీజు, సజ్జాద్ పలువురు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.