దేశ భవిష్యత్తు యువత ప్రవర్తన పైనే ఆధారపడి ఉంది

 విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతిప్రొఫెసర్ S. విజయభాస్కరరావు





నెల్లూరు మేజర్ న్యూస్ (విద్య)మత్తు పదార్థాలకు బలి కాకుండా యువత జాగ్రత్త పడాలని, దేశ భవిష్యత్తు అంతా యువత మీదేఆధారపడిఉన్నందున,సామాజిదృక్పథంతో,అవగాహనతోయువతనడుచుకోవాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం  ఉపకులపతి ఆచార్య విజయ భాస్కరరావు విద్యార్థినులకు ఉధ్బోవించారు. శనివారం నెల్లూరులోని దొడ్ల కౌసల్యమ్మ (Dk) ప్రభుత్వ బాలికల  జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వినియోగంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలోముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, మత్తు పదార్థ రహిత భారతదేశాన్ని నిర్మిస్తామని విద్యార్థినులు, సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు.

 నెల్లూరు జిల్లా BC సంక్షేమ శాఖ అధికారి మరియు నాషా ముక్త  భారత అభియాన్(NMBA ) జిల్లా మెంబర్ సెక్రెటరీ అయిన Y. వెంకటయ్య మాట్లాడుతూ 'వికసిత్ భారత్ కా మంత్ర, భారత్ హో నాషే  సే స్వతంత్ర' అన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్తుపదార్థాలవినియోగంపై నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల ద్వారా విద్యార్థినులు అవగాహన పెంచుకొని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమములో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ మరియ ఇంటర్మీడియట్ బోర్డ్ నెల్లూరు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణా ధికారి (RIO) డా. ఏ శ్రీనివాసులు ప్రసంగిస్తూ కళాశాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో (NSS) విశ్వవిద్యాలయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ అల్లం ఉదయ్ శంకర్, కళాశాల NSS ప్రోగ్రాం ఆఫీసర్లు G. కరుణ కుమారి, B. ప్రసన్న, T. భారతి లతో బాటు లెక్చరర్లు రవీంద్రనాథ్, రమణారెడ్డి, వెంకట్రావు, శ్రీధర్, పూర్ణచంద్రకుమారి, కృష్ణ తులసి , సుధారాణి,శివయ్య ,పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.