జూన్ 1న (నేడు) రైతుల ఖాతాల్లో జమ కానున్న 2023-24 సంవత్సరం మొదటి విడత వై యస్ ఆర్ రైతు భరోసా- పి.యం కిసాన్ ఆర్థిక సాయం రూ.133.48 కోట్లు
జూన్ 1న (నేడు) రైతుల ఖాతాల్లో జమ కానున్న 2023-24 సంవత్సరం మొదటి విడత వై యస్ ఆర్ రైతు భరోసా- పి.యం కిసాన్ ఆర్థిక సాయం రూ.133.48 కోట్లు
మార్చి23 నుండి మే23 అకాల వర్షాల కారణంగా నష్టపోయిన 416 మంది రైతులకు జమ కానున్న పంట నష్ట పరిహారం 32.93 లక్షలు : కలెక్టర్
తిరుపతి, మే31: (నేడు) జూన్1 న 2023-24 సం. కు గాను వై యస్ ఆర్ రైతు భరోసా - పియం కిసాన్ కింద వరుసగా ఐదో సంవత్సరం మొదటి విడత ఆర్థిక సాయం నగదు బదిలీ చేయు కార్యక్రమమును గౌ. ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి పత్తికొండ మండలం, కర్నూలు జిల్లా నుండి ప్రారంభించి బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారని, అందులో తిరుపతి జిల్లాలోని 1,76,921 మంది భూ యజమాని రైతులకు, కౌలు, ROFR సాగు రైతులకు రూ.7500 చొప్పున సుమారు రూ.133.48 కోట్ల లబ్ది చేకూరనుందని, అలాగే జిల్లాలో మార్చి23 నుండి మే23 వరకు పడిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం 416 మందికి 32.93 లక్షలు జమ కానున్నదని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రం లోని రైతులందరికి సాగు ఖర్చు క్రింద పెట్టుబడి సహాయము అందించాలనే ఉద్దేశ్యముతో అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.13,500/- చొప్పున 2019 సం|| నుండి వై.యస్. ఆర్. రైతు భరోసా పి.యం కిసాన్ పథకము క్రింద ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాలలో నేరుగా జమ చేయుచున్న విషయం అందరికి విదితమే.
జిల్లా స్థాయి కార్యక్రమం తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట డివిజన్, తడ మండలం ఎస్ ఆర్ ఎం గ్రాండ్ఇయర్ కళ్యాణ మండపం నందు జూన్1 తేదిన ఉదయం 10 గం.లకు సమావేశము ఏర్పాటు చేయడం జరిగినదనీ, కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతు సోదరులు అందరు విచ్చేసి జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కోరారు.