విద్యుత్ శాఖ సిబ్బంది శ్రమ మరువలేనిది. విద్యుత్ శాఖ ఎస్ఈ విజయన్




నెల్లూరు కలెక్టరేట్ ( మేజర్ న్యూస్)


తుఫాను సమయంలో జిల్లాలోని విద్యుత్ శాఖ సిబ్బంది చక్కగా పనిచేశారని విద్యుత్ శాఖ ఎస్ఈ విజయన్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో పాటు వివిధ విభాగాల అధికారులతో శుక్రవారం టెలికాన్ఫెరెన్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్  కె. సంతోష్ రావు  జిల్లాలోని అధికారులకు, సిబ్బందికి తుఫాన్ ముందస్తు చర్యల ఏర్పాట్లు అభినందనీయమని తెలపడం జరిగిందని ఎస్ఈ తెలిపారు .


అన్ని డివిజన్ ల  అధికారులు సిబ్బంది తుఫాన్ ముందస్తు చర్యలు చాలా బాగా తీసుకున్నారని ఎక్కడ ఏ అవసరం వచ్చినా వెంటనే విద్యుత్ పునరుద్దించడానికి టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాయని దాదాపు 700 మంది వర్కర్స్ ను టీములుగా ఏర్పాటు చేసి సూళ్లూరుపేట  లో తీరం దాటుతుందన్న హెచ్చరికలతో ముందుగానే  టీం లను మరియు అధికారులను సూళ్లూరుపేటకు పంపడం జరిగిందన్నారు. అలాగే పోల్స్ డ్రిల్లింగ్ మిషన్స్, పవర్ సాస్, లైట్స్ అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా డివిజన్ అధికారులకు, సిబ్బందికి,కాంట్రాక్టర్ లకు, సబ్ స్టేషన్ సిబ్బందికి ,పాల్గొన్న ప్రతి ఒక్కరికి  ధన్యవాదాలు తెలియచేసారు.    ఇదంతా ఒకరి వల్ల సాధ్యం కాదని డివిజన్ ల  అధికారులు, సిబ్బంది అంతా టీం వర్క్ చేస్తేనే ఏదయినా సాధ్యం అని తెలిపారు. డివిజన్ లో బకాయిలు చాల ఎక్కువుగా ఉన్నాయని బకాయిలు వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు. డి.సి.లిస్ట్ పక్కాగా చేయాలని లేనిచో చర్యలు తప్పవని తెలిపారు. డి.సి.లిస్ట్ గడువు లోగా పూర్తి చేసి రెవిన్యూ కార్యాలయానికి పంపని యెడల వారికి షోకాజ్ నోటీస్ లు జారిచేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.

ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేయాలని మీరు బాగా పనిచేస్తే వినియోగదారుని దగ్గర మంచి పేరు వస్తుంది మరియు సంస్థ కు మంచిపేరు వస్తుంది అని తెలిపారు. ఈ టెలి కాన్ఫరెన్స్లో లో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళి   పాల్గొన్నారు.