పంచాయతీలో పగలే వెన్నెలాయే
పంచాయతీలో పగలే వెన్నెలాయే
నెల్లూరు [సైదాపురం], రవికిరణాలు ఏప్రిల్ 19 :
సైదాపురం మండలంలోని పాలురు రాజుపాలెం పంచాయతీ పరిధిలో సచివాలయం దగ్గర పట్టపగలే పంచాయతీ వీధి స్తంభాలకు దీపాలు వెలుగుతున్న దృశ్యం పాలూరు రాజుపాలెం గ్రామ పంచాయతీ సిబ్బంది పర్యవేక్షణ లోపంతో, వీధి దీపాలు రాత్రింబవళ్ళు వెలుగుతూనే ఉన్నాయి . దీని వల్ల విద్యుత్ వృధాగా ఖర్చు అవుతుందని గ్రామ ప్రజల ఆవేదన దీనికి కారణం గ్రామ పంచాయతీ సిబ్బంది పర్యవేక్షణ లోపమా లేక విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమా దీనికి కారణం. వీధి దీపాలను సమయానికి తగ్గట్టుగా ఆన్/ఆఫ్ చేయాలని, గ్రామ పంచాయతీ సిబ్బంది పర్యవేక్షణను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.