త్రుటిలో తప్పిన ప్రమాదం




ఉదయగిరి మేజర్ న్యూస్.

పట్టణంలోని ఖాన్షావలి దర్గా సమీపంలో బుధవారం ఈదురు గాలులకు 11 కేవీ విద్యుత్ తీగ తెగి రోడ్డుపై పడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గాలులకు సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద పెద్ద శబ్దం రావడంతో ఒక్కసారిగా విద్యుత్ తీగ తెగి రోడ్డుపై పడింది. ఆ సమయంలో రోడ్డుపై రాకపోకలు సాగించే వారు లేకపోవడంతో పెద్దప్రమాదం తప్పింది. స్థానికులు లైన్మెన్ రమణకు సమాచారం అందించడంతో ఆయన సిబ్బందితో వచ్చి మరమ్మత్తులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.