ఎస్సి, ఎస్టి, బిసి మైనారిటీ కార్పొరేషన్ల నిధులను ముఖ్యమంత్రి వైయెస్ జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించి బడుగు,బలహీన వర్గాల పొట్టకొట్టేరని కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయములో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదేవిధంగా యెస్ సి,యెస్ టి కార్పొరేషన్ నిధులను దారి మళ్ళించి ఆ వర్గాలకు అన్యాయం చేసారని,రాష్ట్రములో 2014 లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటివరకూ ఉన్న ఎస్సి, ఎస్టి, బిసి  మైనారిటీ, కార్పొరేషన్ లతో పాటు నూతనంగా కాపు, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, ఎంబిసి, ఈబిసి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు అందచేసి ఆ వర్గాల వారిని ఆదుకోవడం జరిగినదని,2018-19 ఆర్ధిక సంవత్సరానికి లబ్ధిదారులను ఎంపిక చేసి నాటి తెలుగుదేశం ప్రభుత్వం బ్యాంకులకు సబ్సిడీ మొత్తాన్నీ కూడా విడుదల చేయగా,ఎన్నికల కోడ్ కారణంగా అవి ఆగిపోగా,ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బ్యాంకుల విడుదల చేసిన సబ్సిడీని వెన్నక్కు తీసుకొని వేరే పథకాలకు మళ్లించిందని,2019- 20 ఆర్ధిక సంవత్సరానికి సబ్సిడీ రుణాల కొరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోమని చెప్పి, వారు అనేక వ్యయప్రయాసలకు గురై దరఖాస్తు చేసుకున్న తరువాత ఇంటర్వ్యూ ల తేదీలు ప్రకటించి మరలా వాయిదా వేసి, ఆయా కార్పొరేషన్లకు సంబంధించిన 6వేల కోట్ల రూపాయల
నిధులు వేరే పథకాలకు మళ్లించి ఆయా వర్గాల యువతకు ముఖ్యమంత్రి తీరని అన్యాయం చేసారని,మాటకుముందు ముఖ్యమంత్రి నుండు వారి మంత్రుల వరకు మా ప్రభుత్వం ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీలను ఉద్దరిస్తున్నామని చేపుతున్నారని,అయితే ఆయా వర్గాలకు సంబంధించిన నిధులను వేరే వాటికి మళ్లించి వారికి ఈ ప్రభుత్వం చేసినంత అన్యాయం ఎవ్వరు చేయలేదని,ముఖ్యమంత్రి కి నిజముగా ఈ వర్గాలపై ప్రేమ ఉంటే ఆయా కార్పొరేషన్ల నుండి మళ్లించిన నిధులు తిరిగి వాటికి ఇచ్చి ఆ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను ఇవ్వాలని,అదేవిధంగా గత ప్రభుత్వం హయాంలో సూడి గేదల పెంపకం క్రింద 2018-19 సంవత్సరంకు లబ్ధిదారులను ఎంపిక చేసారని అయితే వారికి ఇంత వరకు గేదలు ఇవ్వలేదని, గేదలు ఇవ్వకుండానే రుణాలు చెల్లించమని బ్యాంకుల నుండి లబ్ది దారులకు నోటీసులు ఇస్తున్నారని, అదేవిధంగా ఈ పధకం 2019- 20 సంవత్సరం నిధులను కూడా ప్రభుత్వం దారి మళ్లించి ఆడపడుచులకు కూడా అన్యాయం చేసిందని అన్నారు.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరు కృష్ణయ్య,పెనుమల్లి శ్రీహరి రెడ్డి, దారా విజయబాబు, శివును రమణారెడ్డి, కలువాయు చెన్నకృష్ణారెడ్డి, ఉయ్యురు వేణు, పాలపర్తి శ్యాం, అగ్గి మురళి, పూల వెంకటేశ్వర్లు, కలికి సత్యనారాయణ రెడ్డి,బాబు, తదితరులు పాల్గొన్నారు