క్రిమినల్ కేసులలో సాక్ష్యాలు దొంగిలించిన కుట్ర ఎవరిదో బహిర్గతం చేయాలి

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

విజయవాడ : నెల్లూరు కోర్టులో  క్రిమినల్ కేస్ లో సాక్ష్యాధారాల దొంగతనంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసుపై ఎవరి ప్రభావం లేకుండా కేసును నిశితంగా పర్యవేక్షించి విచారణ చేపట్టాలని శైలజనాథ్ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఈమేరకు విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

క్రిమినల్ కేస్ లలో నుండి తప్పించుకోవడానికి సాక్ష్యాధారాలను దొంగిలించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఇటువంటి చర్యలను వెంటనే అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసుపై ఎవరి ప్రభావం లేకుండా కేసును నిశితంగా పర్యవేక్షించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని పర్యవేక్షణ అధికారిగా నియమించాలని కోరారు. సమాజంలో శక్తివంతమైన వ్యక్తికి వ్యతిరేకంగా ఉన్న ముఖ్యమైన సాక్ష్యాల చోరీని న్యాయవ్యవస్థపై దాడిగా పరిగణించాలన్నారు. ఈ కుట్రలో భాగస్వామ్యులు అందరిని అరెస్ట్ చేసి న్యాయం జరిగే విధంగా గౌరవ హైకోర్టు కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.