సామాన్యులకు ఫిబ్రవరి 1న గుడ్ న్యూస్ అందింది. ఎల్పీజీ సిలిండర్ ధరలు (Lpg Gas Gylinder Price) భారీగా తగ్గాయి. దీంతో సామాన్యులకు గ్యాస్ ధరలలో ఊరటనిచ్చింది. చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలండర్ (Lpg Gas Cylinder ) రేట్లను తగ్గించాయి. ఫిబ్రవరి నెలారంభంలో సామాన్యులకు శుభవార్త అందించాయి చమురు సంస్థలు. అయితే ఈ ప్రయోజనం కేవలం కొంత మందికి మాత్రమే వర్తిస్తుంది. కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మాత్రమే తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో కొందరికి మాత్రమే ఈ ధరలు వర్తించనున్నాయి.

చమురు సంస్థలు 14.2 కేజీల సిలిండర్ ధరను మార్చలేదు. దీంతో ఎల్పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. దీనివలన వీరికి ఎలాంటి ఊరట లేదు. ఇక ఇండియన్ ఆయి 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 91.5 తగ్గించింది. ధర తగ్గించిన తర్వాత ఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 1907గా చేరింది. ఈనెలలో గ్యాస్ ధరలు పెరగలేదు. చమురు సంస్థలు ఫిబ్రవరి నెల దేశీయ గ్యాస్ ధరలను విడుదల చేయగా.. అందులో సబ్సిడీయేతర సిలిండర్ ధర పెరగలేదు.

ఇక ఈరోజు విడుదలైన గ్యాస్ ధరల ఆధారంగా కోల్ కత్తాలో సిలిండర్ రూ. 1987కు తగ్గింది. దీంతో ధర రూ. 89 దిగివచ్చింది. గతంలో దీని రేటు రూ. 2076 వద్ద ఉండేది. ఇక ముంబైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 91.5 తగ్గి.. రూ. 1948 నుంచి రూ. 1857కు చేరుకుంది. ఇక చెన్నైలో అయితే ఈ సిలిండర్ ధర రూ. 50.5 మాత్రమే తగ్గింది. దీంతో సిలిండర్ ధర రూ. 2080కు చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 14.2 కేజీల సిలిండర్ ధర దాదాపు రూ. 960 వద్ద కొనసాగుతుంది.

ఇక ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను తనిఖీ చేయడానికి మీరు చమురు సంస్థల అధికారిక వెబ్ సైట్ సందర్శించాల్సి ఉంటుంది. ప్రతి నెల మార్పులు జరిగే కొత్త ధరలను https://iocl.com/Products/IndaneGas.aspx పై క్లిక్ చేసి మీ నగరంలో ఉన్న గ్యాస్ సిలిండర్ ధరలను చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ తన వినియోగదారుల కోసం కొత్త రకం ఎల్పీజీ సిలిండర్ ను విడదల చేసింది. దీని పేరు కాంపోజిట్ సిలిండర్. ఈ సిలిండర్ మూడు అంచెల్లో నిర్మించారు. లోపలి నుంచి మొదటి స్తాయి అధిక సాంద్రత కలిగిన పాలిథిన్ తో తయారు చేయబడుతుంది. లోపలి పొర పాలిమర్ తో చేసిన ఫైబర్ గ్లాస్ తో పూత పూయబడుతుంది. ఇక బయటి పొర హెడ్పీఈతో తయారు చేస్తారు.