ప్రజలపై భారలు వైసీపీ నాయకుల జోబీలోకి సోమ్మలు

                                                             పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ  టీడీపీ నాయకులు నిరసన *                                             

నిరసనలో పాల్గొన్న ఓ కార్ డ్రైవర్ పెట్రోల్ డీజిల్  గ్యాస్ నిత్యావసర సరుకుల వై రేట్లు పెంచిన ఘనత మీదే సీఎం జగన్ రెడ్డి అంటూ ఓటు వేసినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాము అంటూ ఆవేదన..

 వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఆదేశాల మేరకు.

 వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచనల మేరకు

వ్యాట్ తగ్గించాలంటూ రాపూరు పట్టణంలో నిరసనలు

*రాపూరు *

ఇంధన ధరలు తగ్గించాలంటూ రాపూరు మండలంలో రాపూరు పట్టణంలో టీడీపీ నాయకులు మండల అధ్యక్షులు దందోలు వెంకనటేశ్వర్లు రెడ్డి, పట్టణ అధ్యక్షులు sk ముక్తర్, తిరుపతి పార్లమెంట్ వెంకటగిరి నియోజకవర్గ అధికార ప్రతినిధి నువ్వుల శివరామకృష్ణ పట్టణంలోని షాజీ మందిర్ నుండి పెట్రోల్ బంకువరకు ర్యాలీ నిర్వహించరు.

 అనంతరం పెట్రోల్ బంకు వద్ద నిరసనచేపట్టారు.

 టీడీపీ మండల, అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి, పట్టణ అధ్యక్షులు sk ముక్తార్, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి నువ్వుల శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.

మధ్యాహ్నం 12 గంటలకు పట్టణం లోని  రోడ్డు కూడలి వద్దగల పెట్రోల్‌ బంక్‌ వద్ద గట్టిగా హారన్‌లు మోగించి పార్టీ శ్రేణులు నిరసన  తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే.. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను పూర్తిగా రద్దుచేస్తానన్న సీ.ఎం జగన్..రెడ్డి 36 రూపాయలు వసూలు చేస్తూ

 మాట తప్పను మడమ తిప్పను అని వాగ్దానం ఇచ్చారు.

  మాట తప్పిన జగన్ రెడ్డి  దుయ్యబట్టారు. రోడ్ల అభివృద్ధి సెస్ పేరిట లీటర్‌కు అదనంగా మరో రూపాయి వసూలు చేయడాన్ని తప్పుపట్టారు. కేంద్రం పన్ను తగ్గించడంతో దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు వ్యాట్‌ని తగ్గించాయని  గుర్తుచేశారు.

 అధికారంలోకి వస్తే..పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామని పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు.

పెట్రోల్ పై లీటర్ కు రూ.16, డీజిల్ పై రూ.17 తగ్గించాలన్నారు. అనేక రాష్ట్రాలు పన్నులు తగ్గించినా.. వైసీపీ ప్రభుత్వం మెుండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

అధిక పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా ట్రాక్టర్, నూర్పిడి ఖర్చులు పెరిగి వ్యవసాయం దెబ్బతినటంతో పాటు ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారన్నారు. లారీల యజమానాలు, కార్మికులు ఆర్థికంగా దెబ్బతినడమే కాక..రవాణ ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు స్థిరాస్థాయికి చేరతాయని ఆందోళన వ్యక్తం చేశారు.  జగన్ సీ.ఎం అయ్యాక దేశంలోనే అధికంగా పెట్రోలు రూ.110.98 చేరటంతో పాటు కరోనా కష్టాల్లో ఉన్న కుటుంబాలపై పెట్రోల్ భారం పిడుగుపాటుగా మారిందని ఆక్షేపించారు.

ఈ నిరసన కార్యక్రమం లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా si క్రాంతి కుమార్ asi వెంకటేశ్వర్లు రావు asi రవి తమ సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. 

ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్లు రెడ్డి , పట్టణ అధ్యక్షులు sk ముక్తార్ తిరుపతి పార్లమెంట్ వెంకటగిరి నియోజకవర్గ అధికార ప్రతినిధి నువ్వుల శివరామకృష్ణ,మాజీ యైస్ ఎంపీపీ పచ్చిగళ్ళ రత్నం, అహ్మద్, కాజా మోదిన్, రవీందర్ రెడ్డి, టిడిపి నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు .