కేయెటి ఒలింపియాడ్ పరిక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విధ్యార్ధులు...


కావలి పట్టణం శాంతినగర్ లో ఉన్న శ్రీ చైతన్య బ్రాంచ్ నందు కెయెటి ఒలింపియాడ్ మొదటి స్ధాయిలో పాఠశాల కు చెందిన విధ్యార్ధులు సత్తా చాటినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పరిక్షలలో 32 మంది విధ్యార్ధులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండవ స్ధాయికి అర్హత సాదించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా శ్రీ చెత్యన్య స్కూల్స్ ఏ జె యమ్ కొండారెడ్డి ,శ్రీకాంత్ ,పాఠశాల ప్రిన్సిపల్స్ కైలేష్ కుమార్ ,అమర్ ,శ్రీ లేఖా సురేష్ ,పాఠశాల ఉపాద్యాయునీ ,ఉపాద్యాయులు పాల్గొని పిల్లలను, అభినందించారు. అలానే రెండవ స్ధాయిలో కూడా మంచి ఫలితాలను సాదించాలని ఆకాంక్షించారు.