సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా
సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ...
* పోలీస్ వెల్ఫేర్ డే
* ఎస్పీ కృష్ణ కాంత్
నెల్లూరు క్రైం (మేజర్ న్యూస్)
పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోలీస్ వెల్ఫేర్ డేను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన వెల్ఫేర్ డే కార్యక్రమంలో ఎస్పి పాల్గొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న 19 మంది (ట్రాన్స్ఫర్స్ రిక్వెస్ట్లు, మెడికల్ సమస్యలు, డిజర్షన్, సస్పెన్షన్ నుండి విధులకు) సంబంధించి వివరాలు సేకరించారు. సమస్యలను కూలంకుషంగా విని, వారి సమస్యలకు తగిన పరిష్కారం చూపుతానని సిబ్బందికి భరోసా ఇచ్చారు . ఫిర్యాదులపై సంబంధిత జిల్లా పోలీస్ కార్యాలయ(డిపివో) అధికారులతో ఎస్పీ మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కారించాలని ఆదేశించారు. సిబ్బంది యొక్క సంక్షేమంలో భాగంగా ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమంలో సిబ్బంది వారి సమస్యలను తనకు నిర్భయంగా తెలియజేయాలన్నారు.