నిఘా పెట్టిన వైసీపీ నాయకులను ప్రజలే తరిమి తరిమి కొడతారు
తేది: 04-02-2023
నిఘా పెట్టిన వైసీపీ నాయకులను ప్రజలే తరిమి తరిమి కొడతారు
-పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 264వ రోజున 54వ డివిజన్ వెంకటేశ్వరపురం జనార్ధన్ రెడ్డి కాలనీ ప్రాంతంలో జరగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ తో ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులపై నిఘా పెట్టిన వైసీపీ ప్రభుత్వం, ఫేస్ రికగ్నిషన్ వంటి మొబైల్ యాప్ లతో ప్రభుత్వ ఉద్యోగుల మీద నిఘా పెట్టిందని, వాలంటీర్లతో ప్రజలందరి మీద నిఘా పెట్టిందని అన్నారు. ఈ రకంగా ప్రజల వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిస్తూ స్వేచ్ఛను హరిస్తోందని అన్నారు. ప్రభుత్వానికి ఉన్న వందలాది పనికిమాలిన సలహాదారుల్లో ఎవరి సలహాలో ఇవి కాని ఈ ప్రభుత్వం పై ప్రజల తీవ్ర వ్యతిరేకతకు ఈ నిఘానే నాందిగా మారిందని అన్నారు. ఆ వ్యతిరేకతను ఎమ్మెల్యేల తిరుగుబాటు రూపంలో, ప్రభుత్వ ఉద్యోగులను హౌస్ అరెస్ట్ చేయడం వంటి చర్యల రూపంలో మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని అన్నారు. వాలంటీర్లతో ఈ ప్రభుత్వం తమ మీద నిఘాను ఎలా పెట్టి తమను వేధింపులకు గురి చేస్తుందో ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కరికీ అర్థం అవుతోందని, తమ భద్రతకి భంగం కలిగిస్తున్న వైసీపీ నాయకులను ప్రజలందరూ తరిమి తరిమి కొట్టే రోజులు ఎంతో దూరంలో లేవని కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.