సూళ్లూరుపేట బార్ కౌన్సిల్ ఎన్నికలు ఏకగ్రీవం
సూళ్లూరుపేట బార్ కౌన్సిల్ ఎన్నికలు ఏకగ్రీవం.
రవి కిరణాలు, సూళ్లూరుపేట, మార్చి 31:-
సూళ్లూరుపేట మున్సిఫ్ మేజిస్ట్రేట్ సివిల్ జడ్జి కోర్టునందు,2023 - 2024 సంవత్సరానికి గాను జనరల్ బాడీ ఎన్నికలు మార్చి 31 న బార్ సమావేశమందిరం లో నిర్వహింపబడ్డాయి. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారగా అడ్వకేట్
పి రమేష్ బాబు శాంతియుతంగా, నిస్పక్షపాతంగా నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అడ్వకేట్ ఎమ్ సుదర్శన్ రావ్, వైస్ ప్రెసిడెంట్ గా అడ్వకేట్ కె ధర్మప్రసాద్, సెక్రటరీ గా అడ్వకేట్ జి. క్రాంతికుమార్, జాయింట్ సెక్రటరీగా అడ్వకేట్ సిహెచ్. మురళి, ట్రెషరర్ గా అడ్వకేట్ యస్ ఏ కరీం ఎన్నికయ్యారు.