హత్య కేసును చాకచక్యంగా చేదించిన నాయుడుపేట పోలీసులు

 బీహార్లో పది రోజులు మఖం వేసి నిందితులను పట్టుకోవడంలో నేర్పును ప్రదర్శించారు

 అచ్చం"కాకి" సినిమాను తలపించేలా సాగిన వీరి అన్వేషణ. 

ఎట్టకేలకు నిందితులను గుర్తించారు

 నాయుడుపేట డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నాయుడుపేటలో మీడియా సమావేశం ఏర్పాటు

రవి కిరణాలు తిరుపతి జిల్లా నాయుడుపేట

 ఈ నెల 2వ తేదీ ఉదయం సుమారు 9 గంటల సమయంలో. శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులో గల ఓ నిర్మాణంలో ఉన్న భవంతిలో. గుర్తు తెలియని మహిళ మృత చెంది ఉన్నట్లు పోలీసులకు సమాచారంఅందింది

 ఘటనా స్థలానికి చేరుకున్న నాయుడుపేట అర్బన్ సీఐ నరసింహారావు వివరాలను సేకరించే పనిలోపడ్డాడు

అంతకుముందు ఈ భవంతిలో

స్థానిక వడ్లు వ్యాపారులు.బీహార్ కుచెందిన కొంతమంది కూలీలను అద్దెకు ఉంచినట్లు విచారణలో తేలింది

ఆ దిశగా విచారణ సాగించిన సిఐ నరసింహారావు

 హత్య అనంతరం నిందితులు బిహార్ కు పరారైనట్లు. తేలింది

 పట్టు వదలని విక్రమార్కుడు సిఐ నరసింహారావు

పెళ్లకూరు ఎస్సై కృష్ణారెడ్డి....

నాయుడుపేట ఎస్సై శ్రీకాంత్....

శ్రీహరికోట ఎస్సై మనోజ్ కుమార్...

సూళ్లూరుపేట ఎస్సై రవిబాబు లతో మూడు బృందాలుగా. ఏర్పాటుచేసి ఉన్నఫలాన బిహార్ కు పంపేశారు..

బిహార్ లో స్థానిక పోలీసుల సహకారంతో. నిందితుల ఫోన్ నెంబర్ల ఆధారంగా. నిందితుల కోసం వేట సాగించారు. ఒకానొక సందర్భంలో నిందితులు పరారవడం... వాళ్లని పట్టుకోవడం.... ఊరు జనాభా అంతా ఒకటై పోలీసుల మీద కూడా తిరుగుబాటు చేసినంత పనైందని.వాళ్ళు తెలిపారు..ఖాకీ సినిమాని తలపించేలా సాగిన

వేటలో ఎట్టకేలకు మన పోలీసులు విజయం సాధించారు. నిందితులను పట్టుకొని బీహార్ నుండి నాయుడుపేట వరకు తీసుకురావడంలో  నాయుడుపేట పోలీసుల చూపిన తెగువ  ప్రశంసానీయం.

 శభాష్....నాయుడుపేట పోలీస్ మిమ్మల్ని చూసి...

డ్యూటీ పై మీకున్న నిబద్ధతను చూసి... ఎంతోమంది తెలుసుకోవాలి... కొంతమంది మారాలి...