మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన ఎంఈఓ
మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన ఎంఈఓ
పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలి
ఎంఈఓ జి.శ్రీనివాసులు
రాపూరు,మేజర్ న్యూస్: పిల్లలకు పెట్టె భోననం మెనూ ప్రకారం నాణ్యంగా ఉండాలి మండల విద్యా శాఖ అధికారి గుండవోలు శ్రీనివాసులు అన్నారు..రాపూరు పంచాయతీ పరిధిలోని మలమ్మగుంట పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకమును ఆయన తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాలలో నాణ్యతతో కూడిన భోజనం6 అందిస్తున్నారని ఇదే విధంగా పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని శుభ్రతతో ప్రతిరోజు అందించాలని మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు సూచించారు పాఠశాలను ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సుందరంగా అలంకరించి ఘనంగా వేడుకలు నిర్వహించాలని పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు పాఠశాలల్లో పిల్లల సామర్థ్యాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దొరసానమ్మ, ఉపాధ్యాయులు శ్రీనివాసులు మధ్యాహ్న భోజన సిబ్బంది ఆయా పాల్గొన్నారు