పుష్ప యాగంతో అత్యంత వైభవంగా ముగిసిన కల్యాణ వెంకటేశ్వర స్వామి  బ్రహ్మోత్సవాలు.




కావలిమేజర్ న్యూస్ :కావలి ముసునూరు హనుమత్ క్షేత్రంలో ఫిబ్రవరి 6న తోమాల సేవతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం పుష్పయాగంతో అత్యంత వైభవంగా ముగిశాయి. ఆలయ వ్యవస్థాపకులు, ప్రధానార్చకులు వేదగిరి సూర్యనారాయణాచార్యులు నేతృత్వంలో తిరుమల వేద పండితులు మురళి, త్రినాద్ తదితరుల ఆధ్వర్యంలో ఎనిమిది రోజులపాటు పూజా క్రతువులు వైభవంగా జరిగాయి. గురు వారం రాత్రి శ్రేదేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి వార్లకు తులసీ సహిత  ఇరవై ఒక్క రకాల పుష్పాలతో  వేద మంత్రోచ్చారణల మధ్య శాస్ట్రోక్తంగా పుష్పయాగం జరిగింది. ఉభయకర్తలకు, తరలి వచ్చిన భక్తులకు అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహంతో కావలి పట్టణానికి, ప్రజలకు మేలు జరగాలని  ప్రధానార్చకులు సూర్య నారాయణాచార్యులు ఆకాంక్షించారు. గ్రామోత్సవాల్లో సహకరించిన ముసునూరు, కావలి పాత ఊరు,  శాంతినగర్, వెంగళరావు నగర్, బాపూజినగర్ తదితర ప్రాంతాల ఉభయకర్తలకు, భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు, ఉభయకర్తలకు మత్స్య అవతారంలో గల విష్ణుమూర్తి చిత్రపటాలను  అందజేశారు.