రైతు సేవా కేంద్రాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం
రైతు సేవా కేంద్రాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్:
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల, దామరమడుగు రైతు సేవా కేంద్రాలలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి. విజయ్ కుమార్ నాయక్ మాట్లాడుతూ మాని పండు తెగులు నివారణకు ప్రోపికొనజోల్ 1 మిల్లీలీటరు/ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని సూచించడం జరిగింది. మండల వ్యవసాయ అధికారి ఎం .సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రతి రైతు తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాలలో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ సంప్రదించి ఈ పంటలో వారు సాగు చేసిన విస్తీర్ణాన్ని నమోదు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ పంటలో నమోదైన రైతులకు మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి దాన్యం కొనుగోలు కేంద్రాలలో వారి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ పంట చేసుకున్న ప్రతి రైతు తప్పనిసరిగా ఈ కేవైసీ కూడా చేయించుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విఏఏ బి. పవన్ కుమార్ మరియు రైతులు పాల్గొన్నారు.