ఎన్నికల కోడ్‌ సక్రమంగా అమలు చేయాలి.

ఎన్నికల నియమావలికి లోబడి అధికారుల పనితీరు ఉండాలి:ఎంపీడీవో నాగరాజు

రవి కిరణాలు న్యూస్



చిట్టమూరు మండలంలో ఎన్నికల కోడ్‌ను సక్రమంగా అమలు చేయాలని,ఎన్నికల నియమావళికి లోబడి పనితీరుడాలని ఎంపీడీవో నాగరాజు అధికారులను ఆదేశించారు.బుధవారం మండలం లోని ఎల్లసిరి,హిస్టోల్,జంగాలపల్లి, అద్దెపూడి,కోతలగుంట,అరవపాలెం గ్రామాలలో పర్యటించి,ఉన్నత, ప్రాథమిక,అంగన్వాడి పాఠశాలలను పరిశీలించి ఎన్నికల కోడ్‌కు అడ్డుగా ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలు,పోస్టర్లు, శిలాఫలకాలపై పేర్లు కనబడకుండా  తొలగించాలన్నారు.ఎన్నికల ప్రవర్తనా నియామావళి అమల్లో ఉన్నందున తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని సూచించారు.నిబంధనలు అతిక్రమిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రభుత్వ ఉద్యోగులు ప్రవర్తించరాదని,నియమావళికి లోబడి పనిచేయాలన్నారు. అధికారులు ఎన్నికల కోడ్‌ అమలుకు కృషి చేయాలన్న ఎంపీడీవో మండలంలోని సచివాలయ సిబ్బంది,పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ,ప్రైవేటు ప్రాంతాల్లోని పోస్టర్లు,బ్యానర్లు, హోర్డింగ్స్‌,గోడ పెయింటింగ్‌లను తొలగించాలన్నారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా ఆయా గ్రామాల్లో పర్యటించి