ఒకటో డివిజన్లో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్న ఇంచార్జ్ కమిషనర్





నెల్లూరు, రవికిరణాలు ఏప్రిల్ 22 : 

నెల్లూరు నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ వై.ఓ. నందన్ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా మంగళవారం స్థానిక 1 వ డివిజన్ కల్తీ కాలనీ, నవలాకుల తోట, నారాయణ రెడ్డి పేట, కొత్త కాలువ సెంటర్ తదితర ప్రాంతంలో పర్యటించారు.ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం అందుకున్న సమస్యను పరిష్కరించేందుకు నవలాకుల తోటలోని అర్జీదారుని కలుసుకున్న ఇంచార్జ్ కమిషనర్, సమస్యపై సంభంధిత అధికారులతో చర్చించారు.నిర్ణీత సమయంలో సమస్యను పరిష్కరించాలని సూచించారు.డివిజను వ్యాప్తంగా ప్రధాన డ్రైను కాలువల పూడికతీత, సిల్ట్ ఎత్తివేత క్రమం తప్పకుండా జరపాలని సూచించారు. అవసరమైన అన్ని ప్రాంతాల్లో డ్రైను కాలువల నిర్మాణాలకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణ సామాగ్రి రోడ్లను ఆక్రమించకుండా వార్డు సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. భవన నిర్మాణ సామాగ్రి వీధులకు అంతరాయం కల్పిస్తూ ఉంటే వారి నుంచి జరిమానా వసూలు చేయాలని సూచించారు.నెల్లూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అనుమతుల ప్రకారం మాత్రమే కట్టుబడి జరిగేలా పర్యవేక్షించాలని అనుమతులు లేని అదనపు నిర్మాణాలు జరుగుతుంటే, ఆయా నిర్మాణాలను వెంటనే ఆపివేయాలని ఇంచార్జ్ కమిషనర్ ఆదేశించారు.