ఘనంగా ముగిసిన సిపిఎం 27వ మహాసభలు
ఘనంగా ముగిసిన సిపిఎం 27వ మహాసభలు
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ఆంధ్ర ప్రదేశ్ 27వ రాష్ట్ర మహాసభలు మూడు రోజులు నెల్లూరులో ఘనంగా నిర్వించారు. పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తి తో ఎన్నో ఉద్యమాల్లో ఎన్నో పోరాటాలలో పాల్గొన్న కామ్రేడ్ లు, ఎన్నో సంవత్సరాల తర్వాత నెల్లూరులో మహాసభలు జరగడంతో పార్టీ నాయకత్వం,ఎర్ర సైన్యం మొత్తం కదలి కసిగా అహర్నిశలు కష్టపడి పని చేసి ఎక్కడా ఎన్నడూ జరగనంతగా మహాసభలను విజయవంతం చేసారు.రాష్ట్ర నలు మూలల నుండి కామ్రేడ్ లు అందరిని సభలకు తరలించడం లో జిల్లా నాయకత్వం కృషి అభినందనీయం.రాష్ట్ర దేశ నాయకుల రాకతో సింహపురి ఎరుపెక్కింది. ముఖ్యంగా ఈ మహాసభలు దిగ్విజయంగా జరగడానికి జిల్లాలోని నాయకులు కార్యకర్తలు తీవ్రంగా కష్టపడ్డారు. మహాసభలకి వచ్చిన కేంద్ర రాష్ట్ర నాయకత్వం వారి ప్రసంగాలతో కార్యకర్తలను ఉత్తేజపరచి వారు కసిగా పార్టీ కోసం పని చేయడానికి నూతనోత్సాహం నింపారు.అసలు కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ ఉంది.. అని మాట్లాడే వారికి మహాసభలకు వచ్చిన ఎర్ర దండుని చూసి నోరెళ్ళబెట్టే లా కార్యక్రమం నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలు మూలల నుంచి ఎర్ర సైన్యం కదలి వచ్చి నెల్లూరు ఎర్ర వనం లా మారిపోయింది.చివరి రోజు మహాసభకు ఏ దిక్కున చూసిన ఎరుపెక్కి పోయింది.పార్టీ జాతీయ రాష్ట్ర నాయకులు కార్యకర్తలకు దిసా నిర్దేశం చేసి వారిని ఉత్తేజపరిచారు.రాష్ట్ర కమిటీ ని కూడా అనవాయితీ గా నెల్లూరు లోని మహాసభలలో ఎన్నిక జరగడం విశేషం.పార్టీ పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలు పై పోరాటం చేయాల్సిన అవశ్యకతను కామ్రేడ్ లకు వివరించారు.ఇళ్ల స్థలాల పోరాటాలు,భూ పోరాటాలు, రైతు, కార్మిక పోరాటాలు నిర్వహించి అనేకమంది ప్రజలకు సిపిఎం అండగా నిలబడినదని అన్నారు.మహాసభల ముఖ్య ఉద్దేశాలను కామ్రేడ్ లకు వివరించి ప్రజల కోసం చేయాల్సిన పోరాటాలలో వారి భాగస్వామ్యాన్ని గుర్తు చేశారు.సిపిఎం నాయకులు మాట్లాడుతూ భాజపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజా మద్దతు తో వారి పైన పోరాడేందుకు సిద్ధమన్నారు.ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్మార్ట్ మీటర్ లను వ్యతిరేకించి అధికారంలోకి రాగానే వాటిని స్వాగతించడం దారుణమన్నారు.ప్రజల కోసం నిరంతరం పోరాడే పార్టీ సిపిఎం పార్టీ నే అని ప్రజల కోసం మన కామ్రేడ్ లు ఎన్ని పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలని వివరించారు.దళితుల కోసం సిపిఎం పార్టీ ఎన్ని పోరాటాలకైన సిద్ధంగా ఉంటుంది అని తెలిపారు. ముఖ్యంగా ఈ సభలకు కేంద్ర రాష్ట్ర నాయకత్వంని నెల్లూరు లో ఒక్క వేదికపైకి తీసుకనివచ్చిన జిల్లా నాయకులు తీవ్రంగా శ్రమించి మహాసభలను విజయవంతం చేయడం లో సఫలం అయ్యారు.ఇదే స్ఫూర్తి తో సిపిఎం పార్టీ నిత్యం ప్రజలకోసం పోరాడుతుంది అని రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు.