డిబిఎస్ కళాశాలలో ఘనంగా నిర్వహించిన ఉపాధ్యాయుల దినోత్సవం.




కావలిమేజర్ న్యూస్: కావలి పట్టణం డిబిఎస్ కళాశాలలో టీచర్స్ దినోత్సవం ని ఘనంగా నిర్వహించారు. జీవితానికి జ్ఞానాన్ని సత్యాన్ని అందించగలిగా ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడని డి.బి.ఎస్. ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ దామిశెట్టి సుధీర్ నాయుడు గురువారం తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునే రోజే ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దామిశెట్టి సుధీర్ నాయుడు మాట్లాడుతూ, ఉపాధ్యాయ స్థాయి నుండి భారత అత్యున్నత మైన రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగి భారతరత్న పురస్కారాన్ని పొందిన మహోన్నత వ్యక్తి నేటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఆదర్శప్రాయుడని తెలిపారు. వారిని స్మరించుకోవడం మన బాధ్యత అని తెలియజేశారు. విద్యార్థి యొక్క అజ్ఞానంఅనే చీకటి తొలగించి వెలుగు అనే జ్ఞానం వైపు నడిపించగలిగిన సమర్థులు ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడే అని తెలిపారు. విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేరేలా నిరంతరం కృషిచేసే నిస్వార్థ జ్ఞానదాత అని కొనియాడారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. టీ.వీ. రావు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు సమాజాన్ని నిర్మించే బిల్డింగ్ బ్లాక్ వంటివాడని కొనియాడారు. సమాజంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే వ్యక్తి ఉపాధ్యాయులే అని, నేటి బాలలే రేపటి పౌరులుఅని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల పరిపాలన అధికారి జి. రమేష్ బాబు, అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.