చెంగాళమ్మ తల్లి ని దర్శించుకున్న టిటిడి జాయింట్ కమీషనర్ త్రినాథ్ రావు దంపతులు.
చెంగాళమ్మ తల్లి ని దర్శించుకున్న టిటిడి జాయింట్ కమీషనర్ త్రినాథ్ రావు దంపతులు.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఫిబ్రవరి 26 (రవి కిరణాలు):-
కాళ్ళంగి నది ఒడ్డున వెలసి ఉన్న తెలుగు తమిళ ఆరాధ్య దైవం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఆదివారం ద్వారకా తిరుమల,శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానము, జాయింట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి వి.త్రినాధ్ రావు కుటుంబ సమేతముగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొన్నారు. వారినిఆలయకార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాస రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారి ప్రసాదములు అందజేసి వేదపండితులచే ఆశీర్వచనము చేయుట జరిగినది.ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు, ముప్పాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.