టిడిపి బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి :- నెలవల

తిరుపతి జిల్లా దొరవారిసత్రం మార్చి 06:- (రవి కిరణాలు):-

 దొరవారిసత్రం టిడిపి  మండల అధ్యక్షులు మరియు రెస్టారెంట్ ఇంచార్జ్ వేమసాని శ్రీనివాసులు నాయుడు  ఆధ్వర్యంలో సోమవారం మండల హెడ్ క్వార్టర్ నందుగల బిసి గురుకుల పాఠశాల నందు మరియు ప్రభుత్వ కార్యాలయంలో, మావిళ్ళపాడు ఆదర్శ పాఠశాల నందు మాజీ పార్లమెంటు సభ్యులు సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ళ విజేత రెడ్డి,  తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని మొదటి ప్రాధాన్యత ఓటు డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కు వేసి గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం  మాట్లాడుతూ

పట్టభద్రులైన విద్యావంతులు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు.
నియంత్రత పాలనైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గోను జకరయ్య ప్రధాన కార్యదర్శి పల్లంపర్తి మనోహర్ రెడ్డి నాగేందర్ నాయుడు రవి నాయుడు గోపాల్ రెడ్డి సుబ్బారెడ్డి సురేందర్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి కృష్ణమూర్తి మరియు తదితరులు పాల్గొన్నారు.