టిడిపి అసత్య ప్రచారాలు మానుకోవాలి.

సూళ్లూరుపేటలో రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నది టిడిపి నాయకులే.

ఆకుతోట రమేష్  రౌడీ షీటర్లను  పెంచి పోషిస్తున్నారు.

పిల్లలు కొట్టుకున్న విషయాన్ని వైసిపి పార్టీకి అంట కడతారా...

మా ఎమ్మెల్యే జోలికి వస్తే ఖబడ్దార్ .... పరిణామం తీర్చుకోక తప్పదు....

నెలవల ... వేనాటి... ఆకుతోట... జాగ్రత్తగా మాట్లాడండి హెచ్చరించిన ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి జెట్టి వేణు యాదవ్.

బహిరంగంగా చర్చలకు రండి ఎవరిది తప్పు తెలుసుకుందాం అని సవాల్ విసిరిన ఎంపిపి అనిల్ రెడ్డి.

రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-

సూళ్లూరుపేట పట్టణంలో గత నాలుగు రోజుల క్రితం జరిగిన ఇద్దరూ వ్యక్తుల మధ్య గొడవలను వైసీపీ పార్టీ నాయకులు టిడిపి పార్టీ నాయకులపై దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టారని వార్తలను సూళ్లూరుపేట ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు.

వాస్తవానికి వైసీపీ పార్టీకి ఇలాంటి గొడవలకు ఎటువంటి సంబంధం లేదని ఈ గొడవలు టిడిపి నాయకుడు ఆకుతోట రమేష్ అనే వ్యక్తి సృష్టించి సూళ్లూరుపేట ను బ్రష్టు పుట్టిస్తున్నారని అన్నారు రాత్రి 10 గంటల నుండి గంటల నుండి  12 గంటల వరకు వరకు హై స్కూల్ గ్రౌండ్ లో చిన్న పెద్ద తేడా లేకుండా వారికి మద్యం అన్ని ఏర్పాట్లు చేసి రౌడీయిజాన్ని పోషిస్తున్నారని అన్నారు.


సూళ్లూరుపేటలో ఇప్పటివరకు ఎలాంటి రౌడీయిజం గుండాయిజం జరగలేదని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నియోజకవర్గం ఎమ్మెల్యే అయి ఇప్పటికే 9 సంవత్సరాలు అయినప్పటికీ ఎలాంటి రౌడీయిజం ప్రోత్సహించడం లేదని తెలిపారు, అయినప్పటికీ రాజకీయపరంగా మా ఎమ్మెల్యేను దెబ్బ తీయాలనే ఆలోచనతో రకరకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. టిడిపి ఇన్చార్జ్  నెలవల సుబ్రహ్మణ్యం, వేనాటి సురేష్ రెడ్డి, ఆకుతోట రమేష్ వీళ్లంతా కలిసి వైసిపి నాయకులపై దాడికి ప్రయత్నించి వారు చేసిన తప్పులను తప్పిపుచ్చుకోవడం కోసం  వైసిపి పార్టీ పై  నెట్టివేయడం సమంజసం కాదని మరలా ఇదే విధంగా జరిగితే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుదని హెచ్చరించారు .

వైసిపి ఎమ్మెల్యే కిలివేరి సంజీవయ్య అందరివాడు పార్టీలకి కుల, మత భేదాలు అతీతంగా అన్ని వర్గాలకు పని చేసే వ్యక్తి కానీ కుట్రలు, కుతంత్రాలు అతనికి తెలియదని మృదు స్వభావం కలిగిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట  ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి,  జెట్టి వేణు యాదవ్  మున్సిపల్ వైస్ చైర్మన్,   మీజురు రామకృష్ణారెడ్డి, వైసిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.