ఇసుక క్వారీని అడ్డుకున్న టిడిపి నాయకులు.   తిరుపతి జిల్లా 

చిట్టమూరు రావికిరణాలు -: మండల పరిధిలోని మెట్టు గ్రామం వద్ద ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇసుక క్వారీని మండల టిడిపి అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కిషోర్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలను మరచి ఇష్టానుసారంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ,దీనివల్ల చుట్టుపక్కల గ్రామాలకు త్రాగునీరు,సాగునీరు ఇబ్బంది కలగడమే కాకుండా రానున్న రోజులలో ఈ క్వారీల వల్ల  వర్షాల కాలంలో ప్రమాదాల స్తంభం ఇచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ అధికారులు ఇసుక క్వారీ నిర్వాహకులకు, అనుచరులుగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ నిబంధన ప్రకారం స్వర్ణముఖిలో ఒక్కమీటర్ లోతు కంటే ఎక్కువ లోతు తీరాదని అలాకాకుండా వారిష్టా ఇష్టానుసారంగా లోతుని తీస్తున్నారని టిప్పర్లకు అధిక లోడ్ చేసి గ్రామాల్లో పోవడం వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని ఇంటి ముందర ఇసుక పెట్టుకుని ఇల్లు కట్టుకోవాలంటే 30 కిలోమీటర్లు డంపింగ్ యార్డ్ కు పోయి తెచ్చుకోవలసిన కర్మ ఎందుకని అన్నారు. ఇకనైనా అధికారులు నిబంధనల ప్రకారం ఇసుక తరలించాలని, అలాగాని పరిస్థితిలో టిడిపి ఆధ్వర్యంలో మెట్టు ఇసుక రీచ్ వద్ద నిరసన చేపడతామని కిషోర్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుంపర్ల చిన్నారావు ,జిల్లా రైతు సంఘం కార్యదర్శి మారం రెడ్డి జనార్దన్ రెడ్డి, బీసీ సెల్ నాయకుడు కస్తూరయ్య,చెంచురామయ్య ఎస్సీ సెల్ నాయకుడు గుంపర్ల శ్రీనివాసులు, బందిలి అంకయ్య,మల్లాం మాజీ సర్పంచ్ కామిరెడ్డి సునీల్ రెడ్డి మైనార్టీ సంఘం అధ్యక్షులు పటాన్ బషీర్ పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.