చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన టిడిపి నాయకులు మాలేపాటి. 




కావలి మేజర్ న్యూస్: కావలి నియోజకవర్గం దగదర్తి మండలం కాట్రాయిపాడు వాస్తవ్యులు లింగం కుంట కొండప నాయుడు తండ్రి లింగంగుంట రామయ్య ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాలికి శస్త్ర చికిత్స కోసం నెల్లూరులో నారాయణ వైద్యశాల నందు చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు గురువారం వైద్యశాలకు వెళ్లి పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడుతూ, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే గన్నవరపు పద్మమ్మ, ఇందిరమ్మ, భవాని, సుశీలమ్మ చిన్నపాటి అస్వీస్త తకుగురై నెల్లూరులోనే వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించి మెరుగైన వైద్యం వారికే అందించాలని డాక్టర్లను కోరారు.