తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వైటీ నాయుడు గారి భౌతికకాయానికి నివాళి అర్పించిన టీడీపీ నేతలు...







మంగళవారం నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్ సెంటర్లో గల టీడీపీ సీనియర్ నాయకులు వైటీ నాయుడు గారి భౌతిక కాయానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర,నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు,నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్,నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గారు,రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య,నన్నే సాహెబ్,జలదంకీ సుధాకర్,సాబీర్ ఖాన్,పమ్మిడి రవికుమార్ చౌదరి గార్లు నివాళి అర్పించారు...

ఈ సందర్భంగా బీద రవిచంద్ర గారు మీడియాతో మాట్లాడుతూ...

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆప్తులు వై టీ నాయుడు గారి మరణం బాధాకరం.ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న, ఎవరు ఆయనకి ఫోన్ చేసినా, ఆయన ఎవరికి ఫోన్ చేసినా, పార్టీ గురించే అడిగేవారు.జిల్లా, రాష్ట్ర స్థాయిలో పదవులు అనుభవించినా, స్థానిక రాజకీయాల వైపే ఎక్కువ మక్కువ చూపేవారు.ఏ పదవి లేకపోయినా ప్రజల గుండెల్లో వై టీ గా చిరస్థాయిలో నిలిచిపోయారు...ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వై టీ నాయుడు గారికి ప్రత్యేక స్థానం ఉంది. వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది...

ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ గారు మీడియాతో మాట్లాడుతూ....

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వైటీ నాయుడు గారితో నాకు సుదీర్ఘ పరిచయం లేకపోయినా, నేను తెలుగుదేశం పార్టీ లో చేరగానే ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను..తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడి గా ప్రకటించిన తర్వాతా మొట్టమొదటిగా ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను.. ఆయన ఎంతో ఆప్యాయంగా దగ్గరికి తీస్కుని ఆయన హావభావాలతో బాగా చేయమని ఆశీర్వదించారు.వైటీ నాయుడు గారి మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు...వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది...