నారీ సంకల్ప దీక్ష ఏర్పాట్లను పరిశీలించిన టిడిపి నేతలు...











నెల్లూరు నగరంలోని మాగుంట లే అవుట్ లో గల అనీల్ గార్డెన్స్లో ఈనెల 6 వ తేదీ జరుగు నారీ సంకల్ప దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జిల్లా టిడిపి నేతలు శుక్రవారం పరిశీలించారు...

ఈ సందర్భంగా ఏ ప్రదేశంలో ఏ గ్యాలరీలు పెట్టాలి, భోజన సదుపాయాలు తదుపరి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకుని వాటిని పరిశీలించారు...

కార్యక్రమంలో ఎవరెవరు ఏ బాధ్యతలు తీసుకోవాలి అన్న విషయాలు కూడా చర్చించారు.కార్యక్రమంలో పాల్గొనే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని  మహిళల నాయకులకు జిల్లా నాయకులు సూచించారు...

పై కార్యక్రమంలో చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, జెడ్ శివప్రసాద్, తాళ్ళపాక అనురాధ, విజేత రెడ్డి, గుంటుపల్లి శ్రీదేవి, పనబాక భూలక్ష్మి, మైనుద్దిన్, కప్పిర శ్రీనివాసులు, కొమరి విజయ, అన్నం దయాకర్ గౌడ్, అబీదా సుల్తానా, మల్లిక, తడకపల్లి సుధ, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, తిరుమల నాయుడు, పెంచల నాయుడు, బాలకృష్ణ చౌదరి,రేవతి, అమ్రుల్ల, కొల్లూరు విజయ, బి.వి.లక్ష్మి, శ్రీదేవి,సుబ్రహ్మణ్యం నాయుడు, హనుమంత రావు, దారా విజయ్ బాబు, నాగేశ్వర రావు, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు...