ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు స్వచ్ఛ భారత్
చిట్టా మూరు లో సేవ కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ నేతలు ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా గత నెల 17వ తేదీ నుంచి ఈ నెల ఏడో తేదీ వరకు 20 రోజులపాటు సేవా సమర్పన్ పేరుతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని 20 రోజుల పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం నరేంద్ర మోడీ గారు 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏడు సంవత్సరాల నుండి భారత ప్రధానిగా నిర్విరామంగా ప్రజాసేవ చేస్తూ ప్రజా జీవనాన్ని గడుపుతున్న సందర్భంగా కేంద్ర పార్టీ ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా మన చిట్టమూరు మండలం లో కూడా గత 15 రోజుల నుంచి అనేక సేవా కార్యక్రమాలను చేయడం జరిగింది ఈ రోజు కార్యక్రమంలో భాగంగా రేపు గాంధీజీ జయంతి సందర్భంగా వారు కలలుకన్న టువంటి గ్రామ స్వరాజ్యం స్వచ్ఛభారత్ ఆశయాన్ని కొనసాగిస్తున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 01-10-2021 ఎల్లసిరి ఎగువ హరిజనవాడ ప్రాథమిక పాఠశాల మరియు అరవ పాలెం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అనంతపురం జిల్లాకు చెందిన రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి తన వంతు సామాజిక బాధ్యతగా సమాజ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ గాంధీ వేషధారణతో గత 2 సంవత్సరాలుగా కరోనా పైన అవగాహన కల్పిస్తూ సమాజ సేవ చేస్తున్నటువంటి తిరుపతయ్య గారు రావడం జరిగింది ఆయనతో పాటుగా మండల కమిటీ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేస్తూ స్కూల్ పిల్లలకు స్వచ్ఛభారత్ పట్ల అవగాహన కల్పిస్తూ తల్లిదండ్రుల పట్ల ఉపాధ్యాయుల పట్ల దేశం పట్ల భక్తి భావాలు కలిగి ఉండాలి అని తెలియ చెప్పడం జరిగింది అదే విధంగా తమ పిల్లలు స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో పాలు పంచుకునే విధంగా ఉపాధ్యాయులకు సహకరించే విధంగా తల్లిదండ్రులు విద్యా కమిటీ చైర్మన్ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు శరత్ చంద్రారెడ్డి ఈ పార్టీ సీనియర్ నాయకులు వెంకటసుబ్బారెడ్డి గోపాల్ రెడ్డి జిల్లా యువ మోర్చా కార్యదర్శి అంజూరు అంకయ్య యువ మోర్చా నాయకులు తూపిలి సుధీర్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు సుంకర అల్లయ్య వాసంతి యువ మోర్చా అధ్యక్షులు లాలాపేట లీల మోహన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ కిసాన్మోర్చా అధ్యక్షులు యుగంధర్ రెడ్డి ఎస్ టి మోర్చా అధ్యక్షులు దాసరి శ్రీనివాసులు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు