వై.ఎస్.యు లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రారంభం..
వై.ఎస్.యు లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రారంభం..
వెంకటాచలం, మేజర్ న్యూస్..
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం (NSS) ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యస్. విజయభాస్కర రావు మరియు రిజిస్ట్రార్ డాక్టర్ కే. సునీత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ, విశ్వవిద్యాలయంలో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామని, ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు చురుకుగా పాల్గొని విశ్వవిద్యాలయ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కోరారు. అంతేకాకుండా, విద్యార్థులు యూనివర్సిటీ సమీప గ్రామాలకు వెళ్లి పరిశుభ్రతపై అవగాహన కల్పించాలనే లక్ష్యాన్ని ఉంచుకున్నట్లు తెలిపారు.రిజిస్ట్రార్ డాక్టర్ కే. సునీత మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత వలన ఆరోగ్యవంతమైన వాతావరణం ఏర్పడుతుందని, ఇప్పటికే NSS విద్యార్థులు విశ్వవిద్యాలయాన్ని శుభ్రంగా ఉంచడంలో ముందుండి వ్యవహరిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా క్యాంటీన్, కిచెన్ గార్డెన్, కళాశాల భవనాల పరిసరాలను శుభ్రపరిచారు. వ్యర్థాలను తొలగించడంతో పాటు, పిచ్చిమొక్కలను తొలగించి విశ్వవిద్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు.ఈ కార్యక్రమాన్ని NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి.వి. సుబ్బారెడ్డి పర్యవేక్షించగా, అధ్యాపకులు డాక్టర్ విజేత, శంకర్ ప్రసూన, సుచరిత విమల, గోవిందు, ఓబులపతి, అలాగే NSS సిబ్బంది వెంకట్, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛ ఆంధ్ర వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడంలో, అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు.