తడ మండలం మాంబట్టు సెజ్ లోని  అపాచి పరిశ్రమలో  కార్మికుడు అనుమానాస్పద మృతి.

తిరుపతి జిల్లా.తడ : మండల పరిధిలోని మాంబట్టు సైజులో ఉన్న అపాచీ పరిశ్రమలు ఓ కార్మికుడు బాత్రూం లో ఉరి వేసుకుని చనిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది చనిపోయిన వ్యక్తి బంధువుల సమాచారం మేరకు
దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డిపాలెం గ్రామానికి చెందిన కొమరం నవీన్ (29 సంత్సరాలు) గురువారం యధావిధిగా విధులకు హాజరయ్యారు.అయితే బాత్ రూంలో అతను మృతి చెంది ఉండడాన్ని కార్మికులు గుర్తించారు.సూళ్లూరుపేట ఆసుపత్రికి నవీన్ ను తరలించిన ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు.

అయితే నవీన్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అతనిని హత్య చేసి చంపి ఉంటారని తలిదండ్రుల ఆరోపణ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం సెక్షన్ హెడ్ కమలాకర్ తోటి కార్మికుల ముందు చొక్కా పట్టుకొని లాగడంతో మనస్థాపం చెంది బాత్ రూం లోకి వెళ్ళి ఉరివేసుకుని చనిపోయినట్లు కార్మికులు తెలిపారు. నీ అతని బంధువులు మాత్రం
సీసీ కెమెరాలు పరిశీలన చేస్తే బాత్ రూమ్ వద్దకు ఎవ్వరెవ్వరు వెళ్లారు అన్నది తెలుస్తుందనీఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్నతడ  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ మృతిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.