గ్రీన్ టెక్ పరిశ్రమలో  అనుమాస్పద మృతి...

రవి కిరణాలు న్యూస్... తిరుపతి జిల్లా... దొరవారిసత్రం మండలం...

దొరవారి సత్రం మండలం నెల బల్లి గ్రామానికి చెందిన విభూది మహేష్( 28 ) శనివారం నాయుడుపేట మండలం మేనకూరు గ్రీన్ టెక్ పరిశ్రమలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. విధుల్లో ఉన్న మహేష్ తనకు తల తిరుగుతున్నట్లు తనతో పాటు పనిచేస్తున్న కార్మికులకు చెప్పాడని విశ్రాంతి తీసుకుంటూ అరగంటలోపే మృతి చెందినట్లు యాజమాన్యం మహేష్ కుటుంబానికి తెలియపరిచారు. ఎప్పుడు ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండే మహేష్ అకస్మాత్తుగా మృతి చెందడంతో అటు బంధువులు ఇటు తల్లిదండ్రులు మహేష్ మృతుపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మొదట కళ్ళు తిరిగి పడిపోయాడని నాయుడుపేట లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకుని వచ్చామని కుటుంబ సభ్యులకి తెలిపిన యాజమాన్యం కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునే లోపు తిరిగి మరో ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చమని యాజమాన్యం తెలిపారు. దీంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఆ విధంగా మహేష్ మృతదేహాన్ని మూడు హాస్పిటలకు తిప్పిన యాజమాన్య వైఖరి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సేవ పంచనామా నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాది క్రితమే పెళ్లయిన మహేష్ కు సంవత్సరం కలిగిన కుమారుడు ఉన్నాడు. దీంతో మహాశివరాత్రి రోజు ఆ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.