న్యూఢిల్లీ: అబార్షన్స్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.అవాంఛిత గర్భాన్ని తొలగించుకునేందుకు మహిళ వైవాహిక స్థితిని ప్రమాణికంగా పరిగణించలేమని తెలిపింది. పెళ్లితో సంబంధం లేకుండా అబార్షన్‌ చేయించుకునే హక్కు మహిళకు ఉందని తెలిపింది. పెళ్లి కాని మహిళలు కూడా అబార్షన్‌ చేయించుకోవచ్చని పేర్కొంది. మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కేసులో సుప్రీంకోర్టు గురువారం ఈ విధంగా వ్యాఖ్యానించింది.
అదే విధంగా భర్త బలవంతం చేసినా అది అత్యాచారమే అవుతుందని సుప్రీం తీర్పునిచ్చింది. వైవాహిక అత్యాచారం నేరంగా పరిగణించాలన్న సుప్రీంకోర్టు.. దాని ద్వారా కలిగే గర్భాన్ని కూడా అబార్షన్ చేసుకునే అధికారం మహిళలకు ఉందని తెలిపింది. గర్భం దాల్చిన 24 వారాల వరకు ఎంటీసీ చట్టం ప్రకారం అబార్షన్‌కు అనుమతినిచ్చింది. ప్రతి భారతీయ మహిళ తనకు నచ్చినది ఎంచుకునే హక్కు ఉందని, కేవలం వివాహిత స్త్రీలే శృంగారం చేయాలని నిబంధన ఏమీ లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.