ఆదరించండి..అభివృద్ధి చేస్తా

బడుగు బలహీన వర్గాల నుంచి వస్తున్న

నామినేషన్ కార్యక్రమానికి అందరూ తరలి రండి

భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై)  చెముకుల శివ కుమార్ యాదవ్




రాపూరు: వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని బీసీవై పార్టీ వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా చెముకుల శివ కుమార్ యాదవ్ తెలిపారు.. బుధవారం రాపూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. నా పై నమ్మకంతో నన్ను అభ్యర్థిగా అవకాశం కల్పించిన బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు..పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలకు న్యాయం చేస్తానన్నారు గత మూడు సంవత్సరాలు నుంచి వెంకటగిరి నియోజవర్గలో ఉంటూ సమస్యల పై నిరంతరం పోరాటం చేస్తానన్నారు..రెండు బలమైన సామాజిక వర్గంతో పోటీ పడుతున్న అందరూ నాకు ఓటు వేసి గెలిపిస్తే అందరికి అందుబాటులో ఉంది సేవ చేసుకుంటానన్నారు..ఈ నెల 25 వ తేదీ మధ్యాహ్నం వెంకటగిరి లో నామినేషన్ వేస్తునానని ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి తనను బలపరచాలని కోరారు..ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..