సూళ్లూరుపేట మునిసిపల్ కార్మికులు రిలే నిరాహారదీక్ష.




నెల్లూరుజిల్లా. సూళ్లూరుపేట : పట్టణంలో ని మునిసిపల్ కార్మికులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ ఫెడరషన్ పిలుపు మేరకు సూళ్లూరుపేట  మున్సిపల్ ఆఫీసు దగ్గర శనివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కా. సుధాకర్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనము  ఇవ్వాలని, అప్కాస్ కాంట్రాక్ట్ యాక్ట్ రద్దుచేసి కార్మికులందరిని పర్మనెంటుచేసి కనీస వేతనాలు ఇవ్వాలని లేని పక్షములో ఫిబ్రవరి 7 నుండి రాష్ట్ర వ్యాపిత నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారని తెలియజేసారు. ఈ నిరాహార దీక్షలో పట్టణ మునిసిపల్ కార్మికులు  ch చెంగయ్య, చిన్నబాబు, వెంకటరత్నం, గోపాల్, రమణయ్య,  శ్రీదేవి, నాగేంద్ర, రేవంత్, పోలయ్య చెంచయ్య పాల్గొన్నారు. ఈ మాధ్యమానికి హాజరైన కమ్యూనిస్ట్ నాయకులు పద్మనాభయ్య,అంగన్వాడి నాయకురాలు

హైమావతి కా.సాంబశవయ్య శంకరయ్య వారి వర్కర్స్ యూనియన్ నాయకులు నాగభూషనమ్ ఉద్యమానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.