సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలంలో పలు అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమాలలో స్థానిక శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారితో కలిసి పాల్గొన్న తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి

మొదటగా చెంబేడు గ్రామంలో 3 లక్షల రూపాయల వ్యయంతో ఎస్.సీ కాలనీకి నిర్మింప తలపెట్టిన సి.సి రోడ్డు కి భూమి పూజ చేయడం జరిగింది. అలాగే చెంబేడు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

పెళ్లకూరు, పునబాక గ్రామాలలోని లోని నూతన సచివాలయ భవనం, రైతుభరోసా కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అర్చకులతో సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. రైతుభరోసా కేంద్రం ద్వారా రైతు మిత్ర గ్రూపు లబ్దిదారులకు ప్రభుత్వ సబ్సిడీలో ట్రాక్టర్ల తాళాలను అందజేశారు.

తదుపరి చెంబేడు, పునబాక గ్రామాల ప్రజలు పలు సమస్యల పరిష్కారం కోసం ఎంపీ గురుమూర్తి గారికి వినతి పత్రాలు అందజేశారు. వారి సమస్యలు సానుకూలంగా విన్న ఎంపీ గారు త్వరలో పరిష్కరిస్తామని తెలియజేసారు.

తదుపరి పెళ్లకూరు మండల కేంద్రంలోని చాగణం లలితమ్మ, భాస్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ఆవరణంలోని వికాస్ కళ్యాణ మండపంలో వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం లో పాల్గొని వాలంటీర్లకు సన్మానం చేసారు.

సూళ్లూరుపేట శాసనసభ్యులు శ్రీ కిలివేటి సంజీవయ్య గారు మాట్లాడుతూ గ్రామ స్వరాజ్య స్థాపనకు నేడు జగన్మోహన్ రెడ్డి గారు నడుం బిగించారని గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజల సమస్యలు తీరుస్తూ ప్రభుత్వ పథకాలు వారి ముంగిటకే అందిస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారాని శ్రీ సంజీవయ్య చెప్పారు అలాగే వాలంటీర్లు చేస్తున్న సేవల గూర్చి ఎంత చెప్పినా తక్కువే అని వారికి నేడు వారికి సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసారు. పార్టీలకు అతీతంగా పని చేయాలనీ అందరూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గారికి అండగా ఉండాలని కోరారు.

ఎంపీ గురుమూర్తి గారు ప్రసంగిస్తూ ప్రభుత్వం ఏ పథకం ప్రవేశ పెట్టినా మరుసటి దినం నుంచే ప్రజలలోకి తీసుకెళ్ళేది వాలంటీర్లేనని వారు ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటి వారని,  కరోనా సమయంలో వాలంటీర్లు ప్రాణాలకు తెగించి తమ పరిధిలోని ప్రజలకు సేవలందించారని, నేడు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రజలకి నడుమ ఒక వారధిలా వాలంటీర్లు పనిచేస్తున్నారని, ప్రభుత్వ పథకాలను ప్రజలకి వివరిస్తూ అర్హులని గుర్తించి వారు ఆ పథకాలు లబ్దిపొందేలా కృషి చేస్తున్నారని వారి సేవలు గర్హనీయమని ఎంపీ గురుమూర్తి గారు కొనియాడారు.

కార్యక్రమంలో సూళ్లూరుపేట ఏమైల్యే శ్రీ కిలివేటి సంజీవయ్య గారితో కలిసి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గారు, ఎన్.డి.సి.సి.బి చైర్మన్ శ్రీ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, మస్తాన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ఎంపీపీ పి.శేఖర్ రెడ్డి గారు, జడ్పీటీసీ ఎన్ ప్రిస్కిల్లా గారు, లింగం నాయుడు గారు, ఆర్.డి.ఓ రోజ్మాండ్ గారు, ఇతర ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.