భూ సమస్య పై సూళ్లూరుపేట ఆర్ డి ఓ కి అర్జీ ఇచ్చిన వి. సి. కే పార్టీ నాయకులు.

రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-

తిరుపతి జిల్లా, ఓజిలి మండలం, కొండవల్లి పాడు . గ్రామదళితులు  సర్వే నెంబర్ 1లోని భూమిని  20సంవత్సరములుగా సాగు చేసుకోని జీవనం చేయుచున్న క్రమంలో గ్రామసర్పంచ్ ప్రభాకర్ రాజు అనే ఆగ్ర కులస్తుడు  బాధ్యత్తారహితంగా,కొంత మంది అగ్రకులస్తులను రెచ్చ గొట్టి దళితులు సాగు చేస్తూన్న భూమిలోని మిరప పంటను కేవలం కక్షపూరితంగా నాశనం చేసి  నష్టపరిచాడు. నిరుపేద దళితులు తాము సాగుచేసుకొనుచున్న పొలము దళితులకు చెందాలని, మరియు మిరపపంట నష్టం చేసినందుకు నష్టపరిహారాన్ని చేకూర్చవలసినదిగా మరియు భవిష్యత్తులో సదరు అగ్రకులస్థులు అకారణంగా ఇలాదాడి చేయకుండా సూళ్ళూరు పేట  రెవిన్యూ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఆర్ డి ఓ) ని కోరడం జరిగినది. ఈపిర్యాదు సమర్పణలో, వి సి కె పార్టీ సూళ్లూరుపేట బాధ్యులు, నాయుకులు, బందిల మోహన్, మల్చి.చెంగయ్య, సదరుగ్రామ దళితులు, కత్తిని కోటయ్య,  ఎంట్రపాటి మోహన్, ఏల్చూరి హరి,  కత్తిన వెంకటరమణయ్య, కోనతం శీనయ్య, ఏల్చూరి రమణయ్య, ఏల్చూరి పెంచలయ్యలు పాల్గోన్నారు.