కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు. దిగ్విజయంగా కృష్ణపట్నం విద్యార్థుల ఎడ్యుకేషన్ టూర్.
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు. దిగ్విజయంగా కృష్ణపట్నం విద్యార్థుల ఎడ్యుకేషన్ టూర్.
ముత్తుకూరు ,జనవరి 11 (మేజర్ న్యూస్) కృష్ణపట్నం హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు సాగించిన ఎడ్యుకేషన్ టూర్ కార్యక్రమం శనివారం నాటికి విజయవంతంగా ముగిసింది. దీంతో ఆ బృందం గ్రామానికి చేరుకుంది. అదానీ ఫౌండేషన్ సామాజిక సేవ కార్యక్రమాల్లో అంశంగా ఉత్తన్ ఆధ్వర్యంలో 48 మంది బృందం గండికోట, బెలం గుహలు, యాగంటి ప్రాంతాలను సందర్శించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఎడ్యుకేషన్ టూర్ లో గుర్తించిన పలు విషయాలు, ప్రాంతాల గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరళ విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. వైజ్ఞానిక, సాంస్కృతిక చరిత్రను తెలియజేశారు. విద్యార్థులు ఎడ్యుకేషన్ కు అదాని ఫౌండేషన్ తో పాటు ఆదాని కృష్ణపట్నం పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ సహాయ, సహకారాలు పూర్తిస్థాయిలో ఇచ్చినట్లు హెడ్మాస్టర్ విద్యార్థులకు తెలిపారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి ఉపాధ్యాయులు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు