సైన్స్ ఫెయిర్ నందు ప్రతిభ చూపిన సూళ్లూరుపేట ఉన్నత పాఠశాల విద్యార్ధులు 

జి ఎస్ ఎల్ వి- ఎఫ్ 15 రాకెట్‌ గగనతల  ప్రయోగం విజయవంతం.

షార్ లో అంబరాన్నంటిన శాస్త్రవేత్తల సంబరాలు.

సైన్స్ ఫెయిర్ నందు ప్రతిభ చూపిన సూళ్లూరుపేట ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి షార్ కేంద్రంలో వందో ప్రయోగమైన జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస







రవి కిరణాలు తిరుపతి జిల్లా 

శ్రీహరి కోట, (సూళ్లూరుపేట) జనవరి29: -

ఇస్రో భారత అంతరిక్షంలో మరో మైలురాయిని చేరుకుంది. శ్రీహరికోటలోని షార్ నుంచి తన వందో ప్రయోగమైన జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ను నేటి బుధవారం ఉదయం 6.23 గం.లకు రోదసిలోకి సక్సెస్ ఫుల్ గా దేశీయంగా రూపొందించిన ఈ

క్రయోజనిక్ రాకెట్ ద్వారా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపి భారత కీర్తిని మరింత ఇనుమడింప చేసింది. జి ఎస్ ఎల్ వి- ఎఫ్ 15 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను సిబ్బందిని అభినందించిన ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్ వి. నారాయణన్‌.

ఇస్రో తన వందో రాకెట్ ప్రయోగం శ్రీహరికోట షార్ - సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుండి చేపట్టిన నేపథ్యంలో సూళ్లూరుపేట పట్టణంలోని విద్యార్థినీ విద్యార్థులు సుమారు 500 మందిని గ్యాలరీ నందు వీక్షించే విధంగా ఏర్పాటుతో, అలాగే తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దంపతులు సైన్స్ ఫెయిర్ నందు అద్భుతమైన ప్రతిభ కనబరచిన సూళ్లూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన  విద్యార్థి ఎస్.కె  ఆఫ్రీద్ 9 వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్ హిమ హన్షిని పదవ తరగతి విద్యార్థినిని ఇస్రో రాకెట్ ప్రయోగ వీక్షణకు తమతో పాటు తీసుకుని వెళ్లారు. అబ్బురపరిచే విధంగా ఇస్రో తన వందో రాకెట్ నేటి బుధవారం ఉదయం తెల్లవారుజామున 6.23 గం.లకు షార్ శ్రీహరికోట నుండి గగనతలంలోకి విజయవంతంగా పంపిన కార్యక్రమాన్ని వారు వీక్షించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ గారు గౌరవ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ మరియు డైరెక్టర్ షార్ సైంటిస్ట్ ఎ.రాజరాజన్ మరియు శాస్త్ర వేత్తల బృందానికి శుభాకాంక్షలు తెలిపి చైర్మన్ ,డైరెక్టర్ షార్ వారితో కలిసి ఫోటోలో పాలుపంచుకున్నారు.  భారత కీర్తిని ప్రపంచ పటంలో ఉన్నత స్థానంలో నిలుపుతున్న ఇస్రో మరియు వారి బృందాన్ని కలెక్టర్ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సూళ్లూరుపేట కిరణ్మయి , శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు.