మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టపరమైన కఠిన చర్యలు

మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ రామారావు 

    




నెల్లూరు క్రైం మేజర్ న్యూస్.

సమాజంలోని మహిళలు,  బాలికల పట్ల ఎవరైనా అమర్యాదగా అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై చట్టపరమైన  కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి కే.సిహెచ్ .రామారావు   తెలిపారు.   జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు మంగళవారం  దర్గామిట్ట లోని ప్రభుత్వ  మహిళా పాలిటెక్నిక్ కళాశాల  విద్యార్థినీలకు నిర్వహించిన అవగాహన సదస్సులో డిఎస్పీ ముఖ్యఅతిథిగా  పాల్గొని మాట్లాడారు.  సమాజంలో మహిళలపై జరుగుతున్న నేరాలు,  మహిళలు, బాల బాలికల సంరక్షణ చర్యలు, బాల్య వివాహాలు, ఫోక్సో యాక్ట్, మానవ అక్రమ రవాణా,  మాదకద్రవ్యాల దుర్వినియోగం, చైల్డ్ పోర్నోగ్రఫీ, సైబర్ క్రైమ్ లపై   కళాశాల విద్యార్థినులకు అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సి.హెచ్. ఏసుదాసు , సెట్నెల్ సీఈఓ నాగేశ్వరావు ,  మహిళ పోలీస్ స్టేషన్ సి.ఐ  కృష్ణారెడ్డి , (AHTU ) యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్  ఏ ఎస్ఐ వై . శ్రీహరి,  సిబ్బంది కె.ప్రసాద్, టీవీఎస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.