ఈ నెల మార్చి17 న నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్- 1 పరీక్ష నిర్వహణ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీ శ

రవి కిరణాలు తిరుపతి, మార్చి15: -





ఈనెల మార్చి 17తేదీన  నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్- 1 పరీక్ష కోసం పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలని, పరీక్ష నిర్వహణకు సిసి కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కి తావు ఉండరాదని జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీ శ అన్నారు.

శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ నెల మార్చి 17 న ఆదివారం జిల్లాలో జరగనున్న గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్ లు, లైజన్ అధికారులు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. 

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ -1 పరీక్షలు ఉ. 10:00 గంటల నుంచి మ. 12:00 గంటల వరకు పేపర్ -1, మ. 2.00 గం.ల నుండి సాయంత్రం 04.00 గం. ల వరకు పేపర్ -2 పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పేపర్ -1 పరీక్ష కొరకు ఉదయం 09:00 గంటల నుంచి 9.45 గంటల వరకు, పేపర్ -2 పరీక్ష కొరకు మధ్యాహ్నం 01.00 నుండి 1.45 వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతి ఉంటుందని, కావున అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని అన్నారు. పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుందని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాల మేరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహించ బడతాయని అన్నారు.

గ్రూప్- 1 పరీక్షల నిర్వహణ కు తిరుపతి పట్టణ, రూరల్ పరిధిలో 16  పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని 9,377 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, 16 మంది లైజన్ ఆఫీసర్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి హాల్ టికెట్ మరియు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్, మొదలైనవి) తీసుకు రావాలన్నారు. గర్భిణీలకు, విభిన్న ప్రతిభావంతులైన అంధులకు గ్రౌండ్ ఫ్లోర్ నందు పరీక్ష రాసేలా  చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద తగినంత పోలీస్ బందోబస్తు కల్పించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు లో  ఉంటుందన్నారు. జిల్లాలో జరగబోయే ఏపిపిఎస్సి గ్రూప్ 1 పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు ఏదేని సమాచారం కొరకు కంట్రోల్ రూం నంబర్లను 9000665565, 9676928804 ఫోన్ ద్వారా సంప్రదించవచ్చునని, పరీక్ష మొదలైన దగ్గర్నుంచి పూర్తయ్యే వరకు పరీక్ష కేంద్రాల నుంచి అభ్యర్థులు బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీరు, ఓఆర్ఎస్ మెడికల్ కిట్ తో పాటు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులకు,  విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ వారిని ఆదేశించారు. జిల్లాలో గ్రూప్ -1 పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెంచల కిషోర్, ఆర్డీఓ తిరుపతి నిశాంత్ రెడ్డి, లైజన్ అధికారులు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ లు, తదితరులు హాజరయ్యారు.