వీధికుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు
- కార్పొరేషన్ పశు వైద్యాధికారి డాక్టర్ మదన్ మోహన్
వీధి కుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని నగర పాలక సంస్థ వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్ పేర్కొన్నారు. వీధికుక్కల నియంత్రణలో భాగంగా జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో సంచరిస్తున్న కుక్కలను గురువారం ఉదయం పట్టుకుని, ప్రత్యేక బోనులో పాత మున్సిపల్ ఆఫీసు సమీపంలోని శస్త్ర చికిత్సా కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ విచ్చలవిడిగా పెరిగిపోతున్న వీధి కుక్కలను తగ్గించడానికి శస్త్ర చికిత్సలే ఉత్తమ విధానమని, సుశిక్షితులైన పారిశుద్ధ్య విభాగ సిబ్బంది ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో కుక్కల నియంత్రణా చర్యలు చేపడుతున్నామని వివరించారు.