వీధి వ్యాపారులకు29 నుండి 31 వరకు టౌన్ వెండింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు
వీధి వ్యాపారులకు29 నుండి 31 వరకు టౌన్ వెండింగ్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు
నెల్లూరు కార్పొరేషన్ (మేజర్ న్యూస్):
నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని మైపాడు రోడ్, జాఫర్ సాహెబ్ కాలువ, సత్యనారాయణ పురం నుండి మైపాడు గేటు కూడలి వరకు గల 200 షాపులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకొనేందుకు వీధీ విక్రయదారులు, వ్యాపారస్తులు దరఖాస్తులు చేసుకొన్నారు. దరఖాస్తులు చేసుకొన్న వీధీ వ్యాపారులకు ఈ నెల 29 వ తేది నుండి 31వ తేది వరకు నెల్లూరు నగర పాలకసంస్థ టౌన్ వెండింగ్ కమిటీ (TVC) ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ లు జరుపబడును.కావున దరఖాస్తు చేసుకొన్న వీధీ విక్రయదారులు, వ్యాపారస్తులు నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు సంబంధిత తేదీలలో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ఇంటర్వ్యూ లకు హాజరు కాగలరు.
దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ లకు వచ్చేటప్పుడు ఒరిజినల్ ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ పాస్ బుక్, మూడు ఫోటోలు, పాన్ కార్డు, గుర్తింపు కార్డు లతో ఇంటర్వ్యూ లకు హాజరు కావలెను అని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ ఒక ప్రకటనలో తెలియజేశారు.