ప్రధాని చొరవతో పురోగతిలోకి రాష్ట్రం





ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో, దూరదృష్టి, అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు మోడీతో సత్సంబంధాలు కలిగి ఉండడంతో రాష్ట్రం పురోగతివైపు పరుగులు తీయనిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్నాటి ఆంజనేయ రెడ్డి తెలిపారు శుక్రవారం నగరంలోని రామ్మూర్తి నగర్ లో ఉన్న బిజెపి జిల్లా కేంద్ర కార్యాలయంలో ఆంజనేయ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానితో చంద్రబాబు నాయుడుకి ఆయనతోపాటుజనసేన పార్టీ అధ్యక్షుడు మంత్రి పవన్ కళ్యాణ్ లకు మంచి సంబంధాలు ఉన్నాయని, అలాగే విద్యావంతులైన విలువలతో కూడిన మంత్రులు ఉండడంతో తిరోగమనములో ఉన్న రాష్ట్రం పురోగతిలోకి వెళ్తుంది అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదన్నాడుఅలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని తన సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇవ్వడం జరిగిందన్నారు  గత ప్రభుత్వం జరిగిన అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు వీటన్నింటికీ పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారందరిని న్యాయస్థానంలో నిలబెట్టి లా చూడాలని చంద్రబాబు నాయుడుకి కర్నాటి విజ్ఞప్తి చేశాడు  అలాంటి వారి విషయంలో ఉదాసీనతగా వ్యవహరించకూడదన్నారు రాష్ట్రంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదని గుర్తు చేశాడు రాష్ట్రంలో అసెంబ్లీలో జరిగే ప్రతి సభలో కూడా ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా కార్యకలాపాలు సాగించే విధంగా అసెంబ్లీలో కొనసాగాలన్నారుఅసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిలో లేకుండా బూతు పురాణాలకే పరిమితం అయిపోయిందని ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా సమావేశాలు కొనసాగాలని,  గత వైసిపి పాలకులు లాగా అసెంబ్లీకి సంబంధంలేని మహిళలను కూడా దుర్భాషలాడడం జరిగిందని, అలాంటి చర్చలకు అవకాశం ఇవ్వకుండా ఈ నూతన టిడిపి ప్రభుత్వం వ్యవహరించాలన్నాడు రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పరిపాలన సాగించాలన్నారు వైసిపి ప్రభుత్వం తాము చేసిన తప్పులను పట్టించుకోకపోగా, ప్రజలు తమకు ఓట్లు వేయలేదని తప్పుపడుతున్నారని ఆయన అన్నాడు, అలాగే ఈవిఎంలను  కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకున్ననే తప్పు పట్టడం విచిత్రంగా ఉంది అన్నారు ప్రతిపక్ష పార్టీగా మీకు గుర్తింపు లేకపోయినా గెలిచిన అభ్యర్థులు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వం తప్పు చేస్తే, తప్పనిసరిగా ప్రశ్నించాల్సింది ప్రతిపక్షమేనన్నాడు ప్రజా సమస్యలపై చర్చించాల్సిన  అవసరం కూడా ప్రతిపక్షంపై ఉందన్నాడు గతంలో తాము అధికారంలో లేమని ఒకసారి ప్రతిపక్ష నేతలందరూ అసెంబ్లీని బాయ్ కట్ చేశారని, ప్రతిపక్షం మరోసారి బాయ్ కట్ చేయకూడదు అన్నాడు రాష్ట్ర అభివృద్ధిలో నిర్మాణాత్మకమైన చర్చలు అసెంబ్లీలో కొనసాగాలని అలాగే అందులో వైసీపీ నేతలు కూడా భాగస్వాములు కావాలని ఆయన కోరారు ఇప్పటికే రాష్ట్రం రాజధాని లేక పోలవరం పూర్తికాక అనేక సమస్యలతో సతమతమవుతుందన్నారు రాజధాని అమరావతికి పోలవరం పూర్తయ్యేందుకు నరేంద్ర మోడీ సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిపాడు కేంద్ర సహకారంతో అమరావతి రాజధాని వేగవంతంగా పూర్తి చేస్తే తద్వారా రాష్ట్ర ఖజానాకి ఆదాయం వస్తుందన్నాడు అలాగే రైతులకి ఇవ్వాల్సిన స్థలాలను తక్షణమే అందజేయాలన్నారు తద్వారా వ్యాపారాల లావాదేవీలు మొదలవడంతో పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుందన్నారు ప్రస్తుతం ఈ జిల్లాలో కొత్త కొత్త రాజకీయాలకు తెర తీస్తున్నారు అన్నారు జిల్లాలో ఇసుక క్వాడ్జ్ మైనింగ్ సిలికా లాంటి వాటిని 

దోచేసి ప్రశ్నించిన వాళ్లపై కేసులు నమోదు చేశారని వీళ్ళందరిని దృష్టిలో ఉంచుకొని ఫిరాయింపుదాలను పార్టీలో చేర్చుకోకుండా చూసుకొని దోచుకున్న వాళ్లపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లాలోని శాసనసభ్యులను ఆయన కోరారు గతంలో వైసీపీ నేతలు బలవంతంగా వాలంటీర్లు చేత రాజీనామా చేయించారని, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాలంటీర్లకు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఉద్యోగమే పరమావధిగా పనిచేసిన వాలంటీర్లను తిరిగి ఉద్యోగాలలో కొనసాగించాలని తెలిపాడు ఈ జిల్లాలో ఎన్డీఏ కూటమి గెలుపుకు అహర్నిశలు కృషిచేసిన బిజెపి జిల్లా అధ్యక్షుడు శీపారెడ్డి వంశీధర్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు  ఈ కార్యక్రమము లో జిల్లా కార్యదర్శి చిలకా ప్రవీణ్, దాసరి రాజేంద్రప్రసాద్, గంజం పెంచల ప్రసాద్, ముక్కు రాధాకృష్ణ గౌడ్, లెక్కల రాజశేఖర్ రెడ్డి అవినాష్, తది తరులు పాల్గొన్నారు.