డి.బి.ఎస్ కళాశాలలో రాష్ట్రస్థాయి సైడ్ వాలీబాల్ పోటీలను నిర్వహించారు.
డి.బి.ఎస్ కళాశాలలో రాష్ట్రస్థాయి సైడ్ వాలీబాల్ పోటీలను నిర్వహించారు.
కావలి మేజర్ న్యూస్: కావలి డి.బి.ఎస్ కళాశాల లో బుధవారం వాలీబాల్ రాష్ట్రస్థాయి పోటీలను ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో త్రీ ఏ సైడ్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలకు 9 జిల్లాల నుండి మొత్తం 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీ లో ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబర్ 20 నుంచి 22 తేదీల వరకు మహారాష్ట్ర షిరిడి ఆత్మమాలిక్ స్టేడియంలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో త్రీ ఏ సైడ్ వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతాయని, ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్నుంచి ఎంపికైన క్రీడాకారులు పాల్గొంటారని, అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యదర్శి సురేష్ రెడ్డి, మురళి ఒక ప్రకటనలో తెలిపారు.పోటీలను ముందుగా డి.బీ.ఎస్ కళాశాల కరస్పాండెంట్ దాంశెట్టి సుధీర్ నాయుడు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టీవీ రావు మరియు కొక్కిరాల సంజీవ్ కుమార్ కాపు సంఘ అధ్యక్షులు ప్రకాశం జిల్లా పాలెం సురేష్ బాబు కందుకూరి రాంబాబు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఈ పోటీలను నిర్వహించేందుకు 9 జిల్లాలకు సంబంధించిన కోచ్లు పాల్గొంటారని పి.డిలు దాసరి శివకుమార్, తెలిపారు. అండర్- 14 విభాగానికి జి. భార్గవి. వెంకటరమణ. అండర్- 17 విభాగానికి అనిల్, రాధా అండర్- 19 విభాగానికి నాగరాజు, దాసరి శివసాగర్కుమార్ ఉండి ఈ పోటీలను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ పోటీలలో ఎంపికైన క్రీడాకారులు జరిగే జాతీయస్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ టీం తరఫున పాల్గొన్నారు. రెండు స్థానం తిరుపతి. మూడవ స్థానం నెల్లూరు. అండర్ -14
గర్ల్స్ ఫస్ట్ ప్లేస్ అనంతపురం. సెకండ్ ప్లేస్ కడప. థర్డ్ ప్లేస్ అన్నమయ్య. అండర్- 17 బాయ్స్ ఫస్ట్ ప్లేస్ నెల్లూరు. సెకండ్ ప్లేస్. అన్నమయ్య. థర్డ్ ప్లేస్ ప్రకాశం. అండర్- 17 గర్ల్స్ ఫస్ట్ ప్లేస్ కడప. సెకండ్ ప్లేస్ నెల్లూరు. థర్డ్ ప్లేస్ తిరుపతి. అండర్- 19 బాయ్స్ ఫస్ట్ ప్లేస్ అనంతపురం. సెకండ్ ప్లేస్ నెల్లూరు. థర్డ్ ప్లేస్ అన్నమయ్య. అండర్- 19 గర్ల్స్ ఫస్ట్ ప్లేస్ కడప. సెకండ్ ప్లేస్ ప్రకాశం. మూడో ప్లేస్ నెల్లూరు. ఈ కార్యక్రమం వివరాలను కావలి డి బి ఎస్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వివరాలను తెలియజేశారు.