రాష్ట్రపతి అవార్డు గ్రహిత చుక్కల పార్థసారథిని అభినందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు..

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్ చుక్కల పార్థసారథి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వై ఎస్‌ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఎన్ ఎస్ ఎస్ సెల్ ద్వారా తాను చేపట్టిన బ్లడ్ డొనేషన్, మొక్కల పెంపకం, గ్రామాలు దత్తతు, డ్రగ్ డిఎడిషన్, ఎయిడ్స్ వ్యాధి, దిశా యాప్ పై చేపట్టిన అవగాహన కార్యక్రమాల గురించి సీఎం గారికి వివరించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి జి.యం సుందరవల్లి గారు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారని  అదేవిధంగా ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం గారు ఏ కార్యక్రమంలో నైనా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లారని సీఎం గారికి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం గారు మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్‌ (జాతీయ సేవా పథకం) జాతీయ అవార్డు  గ్రహీత చుక్కల పార్థసారధిని  ప్రత్యేకంగా అభినందించిన  రానున్న రోజుల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.  ఇదే విధంగా రాబోయే రోజుల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా విశ్వవిద్యాలయనికి, రాష్ట్రానికి మరింత ఖ్యాతి వచ్చేలా కృషిచేయాలన్న ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారు.