మే 17 నుండి శ్రీవారు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం స్తంభప్రతిష్ట కార్యక్రమం 




నెల్లూరు [బుచ్చిరెడ్డిపాలెం], రవికిరణాలు ఏప్రిల్ 16 : 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో వెలసి ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితై దేవస్థానానికి సంబంధించి2025 మే 17నుండి శ్రీవార్ల వార్షిక బ్రహ్మోత్సవములు ప్రారంభం సందర్భంగా బుధవారం ఉదయం  దేవస్థాన సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి  అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి  స్తంభప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు.ఆలయ అర్చకులు, పురోహితులు, వేదపండితులు ఆలయ ముఖమండపము వద్ద ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించి స్థంభం ప్రతిష్టింపజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.