34వ వార్డు లో శ్రీకాంత్ చేరిక....దేనికి సంకేతం??

 కావలి రవికిరణాలు 

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కావలి పట్టణ 34వ వార్డు లో గౌరవ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో ప్రముఖ కాపు నాయకుడు శ్రీ గునుకుల శ్రీకాంత్ నాయుడు గారు వైఎస్సార్సీపీ లో చేరారు. పసుపులేటి రత్తమ్మ గారు ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమం లో ప్రియతమ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు శ్రీకాంత్ నాయుడుకి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు.

మలిశెట్టి కంచుకోట అయిన 34వ వార్డులో ఆయన సామాజిక వర్గానికే చెందిన విద్యావంతుడు ,నిగర్వి, స్నేహశీలి అయిన గునుకుల శ్రీకాంత్ నాయుడు వైఎస్సార్సీపీ లో చేరడం పట్టణంలో ఒకింత చర్చనీయాంశం అయింది.గత కొంత కాలంగా సుప్తావస్థలో వున్న 34వ వార్డు తెలుగుదేశం శ్రేణులకు శ్రీకాంత్ లాంటి సామాజిక స్పృహ వున్న ఒక నాయకుడు వైసీపీలో చేరడంతో మరింత నిస్తేజం అలుముకుంది.వార్డు లో శ్రీకాంత్ వైసీపీలో చేరికతో మలిశెట్టి,సూరిశెట్టి వర్గాలకు భారీ షాక్ అనే చెప్పవచ్చు.

మొదటినుండి 34వ వార్డు లో తెలుగదేశం పార్టీ సానుభూతి పరులుగా వున్న పసుపులేటి, అలహరి,తోట, వూసా, గునుకుల వంటి బలమైన కాపు వర్గాలు అన్ని శ్రీకాంత్ చేరికతో ఏకతాటి పైకి వచ్చి వైసీపీ కి అండగా నిలబడునుండటంతో రాబోయే వార్డు ఎన్నికలో 34వ వార్డు లో వైసీపీ జెండా ఎగరడం ఖాయం అని పలువురు విశ్లేషకులు పరిగణిస్తున్నారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ నాయుడు విలేకర్ల తో మాట్లాడుతూ జగన్ అన్న ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు మరియు అభివృధి కార్యక్రమాలకి ఆకర్షితుడై ఏమి ఆశించకుండా వైసీపీలో చేరానని తనకు ఓపిక కాదు ఊపిరి ఉన్నంత వరకు వైసీపీ కోసం పాటుపడతానని రాబోవు 2024 సార్వత్రిక ఎన్నికలలో కావలి నుండి ప్రతాప్ అన్నని అత్యధిక మెజార్టితో ఎమ్మెల్యే గా ఎన్నుకొని జగన్ అన్న కి బహుమతి గా ఇవ్వడంలో తన వంతు పాత్ర పోషిస్తానని తెలిపారు.

కాగ ఈ పరిణామంతో గత కొద్ది రోజులుగా తమ వర్గం లో శ్రీకాంత్ ని చేర్చుకోవాలి అని విశ్వ ప్రయత్నాలు చేసిన పసుపులేటి సుధాకర్ వర్గానికి తీవ్ర 

శృంగభంగం అయినట్టుగా భావిస్తున్నారు.

శ్రీకాంత్ చేరిక లో కర్త క్రియ కర్మ అన్ని తానై నడిపించిన గుర్రం వెంకటేశ్వర్లు (G V)కు పట్టణం లోని పలువురు వైసీపీ నాయకులు ప్రశంసలు అందజేశారు.ఏది ఏమైనా శ్రీకాంత్ లాంటి అకుంఠిత దీక్ష పరుడు, నిబద్ధత తో పని చేసే నాయకుడు తమ పార్టీలో చేరడంతో పట్టణం లోని వైసీపీ శ్రేణులు నూతనోత్సహంతో ఊరకలు వేస్తున్నాయి.

చివరగా శ్రీకాంత్ అభ్యర్ధన మేరకు  ఇటీవలే జన్మించిన తన కుమారునికి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు "గునుకుల జితిన్ సాయి కృష్ణ"గా

నామకరణం చేయడం కొసమెరుపు..